చాలా పెద్ద బ్యాగ్రౌండ్ అయిన మెగా కాంపౌండ్  నుంచి వచ్చినప్పటికీ తన కెరీర్లో ఇప్పటిదాకా 'శ్రీరస్తు శుభమస్తు' తప్ప ఇప్పటివరకు కూడా సరైన విజయం లేని అల్లు శిరీష్.. ఇప్పుడు 'ఊర్వశివో రాక్షసివో' సినిమాతో బాక్సాఫీస్ పరీక్షకు సిద్ధమయ్యాడు. అను ఇమ్మాన్యుయెల్ కథానాయికగా కనిపించిన ఈ రొమాంటిక్ కామెడీ ఈ రోజే ప్రేక్షకుల ముందుు వచ్చింది. డబుల్ మీనింగ్ డోస్ బాగా ఎక్కువైపోయి కొన్ని సినిమాలు మరీ 'చీప్'గా అనిపించడంతో ఆ సినిమాల వరదకు అడ్డు కట్ట పడింది. ఇంటర్నెట్ విప్లవం కారణంగా పోర్న్ కంటెంట్ కూడా చాలా ఈజీగా దొరికేస్తోంది. ఇక జబర్దస్త్ లాంటి కామెడీ షోల వల్ల డబుల్ మీనింగ్ జోకులు.. కామెడీకి లోటే లేదు. కాబట్టి ఈ రోజుల్లో యూత్ ను బోల్డ్ కంటెంట్ తో ఆకట్టుకోవడం కష్టమైపోతోంది. ఇలాంటి టైంలో యూత్ ను టెంప్ట్ చేసే రొమాన్స్.. వాళ్లకు గిలిగింతలు పెట్టే కామెడీ డోస్ సరిపాళ్లలో కుదిరిన సినిమాగా 'ఊర్వశివో రాక్షసివో'ను చెప్పొచ్చు. ఒక మామూలు కథను ఎక్కడా బోర్ కొట్టని విధంగా ఎంటర్టైనింగ్ గా నరేట్ చేయడంతో ఇందులో టైంపాస్ వినోదానికి ఢోకా లేకపోయింది.ఇందులో అడల్ట్ డోస్ ఏమీ తగ్గలేదు. సినిమా నిండా బోలెడన్ని ఇంటిమేట్ సీన్లున్నాయి. ఇక కామెడీలో అయితే డబుల్ మీనింగ్ డోస్ మామూలుగా లేదు. దీనికి తోడు లైట్ హార్టెడ్ హ్యూమర్ కూడా తోడవడంతో ఎక్కడా బోర్ అయితే కొట్టించదు 'ఊర్వశివో రాక్షసివో'. ముఖ్యంగా యూత్ బాగా ఎంజాయ్ చేసే సీన్లు ఇందులో బోలెడున్నాయి.తొలి సన్నివేశం నుంచి కామెడీ డోస్ కు లోటు ఉండదు.


మహా సిగ్గరి అయిన హీరో.. డేరింగ్ అండ్ డాషింగ్ అయిన హీరోయిన్.. భిన్నధ్రువాల్లా అనిపించే ఈ రెండు పాత్రల మధ్య పరిచయ సన్నివేశాల నుంచి.. ప్రతి సీన్ సరదాగా అనిపిస్తుంది. వెన్నెల కిషోర్.. సునీల్ కలిసి ఎక్కడా ఫన్ డోస్ తగ్గకుండా చూశారు. హీరో హీరోయిన్ల మధ్య కూడా వినోదం పండేలా సీన్లు పడ్డాయి. హీరోయినే హీరోను శృంగారానికి ప్రేరేపించే సన్నివేశాలు కుర్రాళ్లను కుదురుగా కూర్చోనివ్వవు. లిప్ లాక్స్ అయితే లెక్కపెట్టుకోనన్ని ఉన్నాయి సినిమాలో. కథలో వచ్చే సింపుల్ ట్విస్టులు కూడా ఆకట్టుకుంటాయి.పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ లాగా కనిపించే సినిమాను.. మరీ సీరియస్ టోన్లో నడిపించడం.. విషాదభరిత గీతాలు పెట్టడం వల్ల అవి సింక్ కాలేదనిపిస్తుంది. కథను ముగించడానికి అలా చేయక తప్పలేదేమో కానీ  ప్రి క్లైమాక్స్.. క్లైమాక్స్ ను కూడా కొంచెం షార్ప్ చేసి ఉంటే 'ఊర్వశివో రాక్షసివో' కంప్లీట్ ఎంటర్టైనర్ అయ్యుండేది. అడల్ట్ డోస్ ఎక్కువ కావడం ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమాకు దూరం చేయొచ్చు. యూత్ కు మాత్రం 'ఊర్వశివో రాక్షసివో' బాగానే నచ్చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: