వచ్చేయేడాది సంక్రాంతికి పలు క్రేజీ సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే చాలావరకు సినిమాలు ఇప్పటికే సంక్రాంతి వార్ కి సయ్యంటూ విడుదల తేదీని ప్రకటించాయి. ఇందులో ముఖ్యంగా ప్రభాస్ నటిస్తున్న తొలి మైథలజికల్ మూవీ ఆది పురుష్ సినిమా సంక్రాంతి బరిలో జనవరి 12న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా వాయిదా పడుతోంది అంటూ కూడా చిత్ర బృందం ప్రకటించడం జరిగింది. ఇదంతా ఇలా ఉంటే సంక్రాంతి రేసు నుంచి ఆది పురష్ సినిమా తర్వాత మరొక సినిమా కూడా తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


అఖిల్ నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఏజెంట్ సినిమాని డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మమ్ముట్టి కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు  ఈ సినిమాని ఫైనల్ గా వచ్చేయేడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేశారు కానీ సంక్రాంతికి నెలకొన్న పోటీ ఈ సినిమాని సోలాగా విడుదల చేయడమే మంచిదని భావించిన చిత్ర బృందం సంక్రాంతి రిలీజ్ విషయంలో వెనక్కు తగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి రేసులో సీనియర్ హీరోలు అయినటువంటి చిరంజీవి సినిమా బాలకృష్ణ సినిమా బరిలో దిగడంతో కాస్త గట్టి పోటీ ఉంటుందని ఉద్దేశంతో ఏజెంట్ సినిమాని చిత్ర బృందం శివరాత్రికి విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ఇక చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలతో పాటు విజయ దళపతి నటిస్తున్న వారసుడు సినిమా, అజిత్ నటిస్తున్న తునివు వంటి సినిమాలు విడుదల కాబోతున్నాయి.దీంతో చాలావరకు థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది అందుచేతనే ఏజెంట్ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పించి శివరాత్రికి విడుదల చేయడం మంచిదని నిర్ణయాన్ని తీసుకోవడంతో అఖిల అభిమానులు కూడా ఈ నిర్ణయం సరైనదే అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: