ప్రభాస్ హీరోగా నటిస్తున్న పలు సినిమాలలో ఒకటి ఆది పురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా మైథాలజికల్ ఫిల్మ్ గా ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రాబోతున్న ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని అధికారిక ప్రకటన ఇచ్చింది. అయి తే కారణమేంటో తెలియదు కానీ అకస్మాత్తుగా ఈ సినిమాను మరొకసారి వాయిదా వేసింది చిత్ర బృందం.

దీనికి సంబంధించిన వివరాలు ఏంటో ప్రేక్షకులకు తెలియజేయకుండానే ఈ సినిమాను ఈ విధంగా వాయిదా వేయడం వెనక ఏం జరి గిందో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. కృతి సనన్ సీతగా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు. ఈ సినిమాను అసలు విడుదల చేస్తాడా లేదా అన్న సందేహాలు అందరిలో ఎక్కువ అవుతున్నాయి. ఈ సినిమా యొక్క టీజర్ విడుదల అయినప్పుడే ఈ చిత్రం పై చాలా మంది పెదవి విరిచారు. ఎన్నో అంచనాలు పెట్టుకుని వచ్చిన ఈ టీజర్ ఈ విధంగా ఉండటంతో ఒక్కసారిగా నిరాశపడ్డారు ప్రేక్షకులు.

దాంతో ఈ సినిమాను రీ ఎడిట్ చేయాలనే చిత్ర బృందానికి ప్రభాస్ సూచించాడు. అయినా కూడా ఈ సినిమా యొక్క ఔట్పుట్ పట్ల సంతృప్తి గా లేని ప్రభాస్ దీనిలో భారీ స్థాయిలో మార్పులు చేయాలని చెప్పగా అప్పటికే విడుదల తేదీని అనౌన్స్ చేయడంతో అప్పటికి ఈ సినిమాను ఎడిట్ చేయడం కుదరదని చెప్పి ఏకంగా సినిమానే వాయిదా వేయడం జరిగింది. అలా ఈ సినిమా జూన్ కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా ఈ సినిమా యొక్క యానిమేషన్ పనులను బాగా చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారా అనేది చూడాలి. ఈ సినిమా ప్రధానం గా గ్రాఫిక్స్ మీదనే నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: