టాలీవుడ్ లో హీరోయిన్స్ తో సమానమైన ఫాలోయింగ్ ను కలిగి ఉన్న అతి కొద్ది మంది యాంకర్లలో సుమ మొదటి స్థానంలో ఉంటుంది. దాదాపు మూడు దశాబ్దాలుగా బుల్లితెరను ఏలుతున్న మకుటం లేని మహారాణి అని చెప్పవచ్చు . చలాకి మాటలతో అలరించే సుమ ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే అప్పుడప్పుడు సినిమాలలో కూడా నటిస్తూ ఉంటుంది.  ఈమె మొదటిసారి దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఈమె పుట్టింది మలయాళీగా అయినప్పటికీ తెలుగింటి కోడలిగా వచ్చి ఇక్కడ రచ్చ చేస్తుంది.  ఈమె తన తోటి నటుడైన రాజీవ్ కనకాలను ప్రేమించి,  1999లో వివాహం చేసుకుంది.


 ఇక రాజీవ్ కనకాల విషయానికి వస్తే.. ప్రఖ్యాత నటుడు, రంగస్థలం నటుడు, దర్శకుడు , నిర్మాత అయిన దేవదాస్ కనకాల కుమారుడే.. వీళ్ళ అమ్మ కూడా లక్ష్మీ కనకాల కూడా రంగస్థలం నటి. ఈయన మొదటిసారి రంగస్థలం నటుడిగా ఉంటూనే వెల్కమ్ బ్యాక్ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు.  ఆ తర్వాత బాపు దర్శకత్వంలో తెరకెక్కిన రాంబంటు సినిమా ఈయనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇకపోతే నవంబర్ 13 1968లో హైదరాబాదులో జన్మించిన ఈయన నిన్న 53వ పుట్టినరోజు జరుపుకున్నారు.  ఈ సందర్భంగా రాజీవ్ కనకాల తన భార్య సుమాతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు జరుపుకున్న వేడుకలను వీడియో ద్వారా ట్విట్టర్లో షేర్ చేయడం జరిగింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది. అంతేకాదు టైటానిక్ తరహాలో వీళ్ళిద్దరూ ఒక పడవలో ఫోజులు ఇవ్వడం కూడా ఇప్పుడు వైరల్ గా మారుతుంది అని చెప్పాలి. ఏది ఏమైనా రాజీవ్ కనకాల వయసు 53 సంవత్సరాల అనేసరికి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఇంకా యంగ్ గా కనిపించే ఈయన వయసు ఇంతనా అంటూ తమ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: