టాలీవుడ్ లో ఒకప్పుడు అగ్ర దర్శకుడి గా వెలుగుంది ప్రేక్షకుల ను తన సినిమా ల ద్వారా ఎంతగా నో అలరించాడు శ్రీను వైట్ల. కామెడీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే శ్రీనువైట్ల గత కొన్ని సినిమాలుగా ఏ మాత్రం ఆలచించలేకపోతున్నాడు. ఆయన చిత్రాలు బాక్సా ఫీస్ వద్ద తేలిపోవడంతో ఆయనకు వచ్చిన క్రేజ్ మెల్లమెల్లగా తగ్గిపోయింది. ఇప్పుడు ఆయనను నమ్మి పెద్ద హీరోలు ఎవరు కూడా డేట్లు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.

వచ్చిన అవకాశాలను వృధాగా పోగొట్టుకుంటూ శీను వైట్ల ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలో చేయ డానికి సిద్ధమవుతున్నాడు. ఆ విధంగా గోపీచంద్ తో ఆయన ఇప్పుడు ఓ సినిమా చేయబోతున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రక టన కూడా  రాబోతుంది. ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న గోపీచంద్ ఆ చిత్రం తర్వాత ఈ దర్శకుడుతో చేతులు కలపబోతున్నాడట. ఈ నేపథ్యంలో గోపీచంద్ లాంటి హీరోతో సినిమా అంటే శ్రీనువైట్లకు మంచి ఛాన్స్ అనే చెప్పాలి.

ఇంకొక వైపు గోపీచంద్ కెరీర్ కూడా ఏమంత బాగో లేకపోవడం నిజంగా ఈ ఇద్దరు కలిసి ఒక హిట్ సినిమా చేస్తే వారి కెరియర్లకు మంచి ది అని చెప్పవచ్చు. మరి శ్రీను వైట్ల పూర్వ వైభవం అందుకోవాలి అంటే విజయం సాధించాల్సిన సినిమాలు ఏ విధంగా చేస్తారో చూడాలి ఆయనకు ఈ సినిమా విజయం సాధిస్తే తప్ప తదుపరి సినిమా అవకాశం వచ్చేలా లేదు. మరి గతంలో చేసిన తప్పులు రిపీట్ చేయకుండా ఈ దర్శకుడు మంచి సినిమా చేస్తే అయన నుంచి మంచి సినిమాలు వస్తాయని అయన అభిమానులు భావిస్తున్నారు. కామెడీ తో యాక్షన్ సినిమాలు చేసే దర్శకుడిగా శ్రీను వైట్ల సిద్ధ హస్తుడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: