ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలు వాయిదా పడుతూ ఉండడం ఆయన తరువాత చేయబోయే సినిమాల పట్ల ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఆ విధంగా ఆది పురుష్ చిత్రం విడుదల వాయిదా పడడం ఇప్పుడు ప్రాజెక్టుకే సినిమాపై ఎంతో ప్రభావం చూపిస్తుంది అని చెప్పాలి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్విని దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ కథానాయక దీపిక పడుకునే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా అమితాబచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో విడుదల చేయాలని భావించిన చిత్ర బృందానికి అనుకోకుండా ఆది పురుష్ చిత్రం వాయిదా పడడం పెద్ద ఇబ్బందిని తెచ్చిపెట్టింది అని చెప్పాలి. ఎన్నో అంచనాలతో భారీ వ్యయం తో రూపొందుతున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులందరికీ మెప్పిస్తుంది అని అన్న నమ్మకంతో ఉన్నారు. అయితే ఇలా వాయిదా పడడం వల్ల ఈ సినిమా పట్ల ఉన్న క్రేజ్ తగ్గుతుందా అన్న అనుమానాలను కలిగిస్తుంది. 

ఇంకొక వైపు ప్రభాస్ ఆది పురుష్ చిత్రం వాయిదా పడడం ఆయనను మనశ్శాంతిగా ఉంచడం లేదు అభిమానుల నుంచి తొందరగా ఒక సినిమాను విడుదల చేయాలి అని ఒత్తిడి నెలకొనగా పుండు మీద కారం చల్లినట్లుగా ప్రాజెక్టుకే సినిమా యొక్క షూటింగ్ను ఆపేసి సలార్ చిత్రాన్ని ముందుకు తీసుకువచ్చే విధంగా ఆయన ప్రణాళికలు రచిస్తున్నాడట. సలార్ సినిమాను త్వరగా పూర్తిచేసి వేసవిలో విడుదల చేయాలి అన్నది ప్రభాస్ ఆలోచన గా మారిందట. ఆ విధంగా ప్రాజెక్టుకే సినిమాకు కేటాయించిన డేట్ లని ఈ సినిమాకు ఆయన వాడుతున్నారు.  మరి ప్రభాస్ అభిమానుల అగ్రహ చల్లరాలంటే ప్రభాస్ ఈవిధంగా చేయక తప్పదు. ఇకపోతే ప్రాజెక్ట్ కే పరిస్థితి చూస్తుంటే ఈ సినిమా వచ్చే ఏడాది కూడా విడుదల అవడం కష్టం అనిపిస్తుంది. ఈ సినిమా ను ఆ పై వచ్చే ఏడాది విడుదల అయ్యేలా సూచనలు కన్పిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: