మార్షల్ ఆర్ట్ లెజెండ్ గా .. హాలీవుడ్ యాక్షన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న బ్రూస్ లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈయన అంటే పడి చస్తారు . హాంగ్కాంగ్ పరిశ్రమలో సుప్రసిద్ధ మార్షల్ ఆర్ట్స్ కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన నటుడిగా మరింత సంచలనం సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న బ్రూస్ లీ 1973 వేసవిలో 32 సంవత్సరాల వయసులో ఆకస్మికంగా మరణించాడు. అయితే అతడి ప్రత్యర్ధులే విషం ఇచ్చి చంపేశారని అప్పట్లో కథనాలు కూడా వెలువడ్డాయి.. ఇదిలా ఉండగా దాదాపు ఆయన చనిపోయి 50 సంవత్సరాల తర్వాత వైద్యులు ఆయన మరణం పై విచారణ దావా వేస్తుండడం సంచలనంగా మారింది.


నాటి శవ పరీక్ష నివేదికలో బ్రూస్ లీ మెదడు వాపు వ్యాధి తో మరణించినట్లు వార్తలు వచ్చాయి.  నొప్పి నివారణ మందులు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ మరణం సంభవించిందని వైద్యులు తెలిపారు. అయితే ఇప్పుడు మరొకసారి పరిశోధకులు నాటి సాక్షాలను సమీక్షించగా వైద్యులు చెప్పిన కారణంతో కాకుండా వేరొక కారణంతో ఆయన మరణించారని సమాచారం.  హైపోనాట్రేమియా అనే అరుదైన సమస్యతో అతడు మరణించినట్లు నిర్ధారించారు. అయితే దీనిని మరో భాషలో చెప్పాలి అంటే బ్రూస్ లీ శరీరం నుంచి అదనపు నీటిని విసర్జించడంలో కిడ్నీ ఫెయిల్ అయిందని ఈ కారణంగానే ఆయన మరణించారు అని సమాచారం.


ముఖ్యంగా హైపోనాట్రేమియా.. సెలెబ్రెల్ ఎడేమా కు కారణమైంది.  మూత్రంలో నీటిని విసర్జించడంలో విఫలం అయినందుకే ఆయన మరణించారు.. అని సమాచారం.. " నా మిత్రమా నీటిలా ప్రవహించు.. నీరులా ఉండు"  అని బ్రూస్ లీ ఎప్పుడూ తన సహచరులతో చెబుతుండేవాడు.  కానీ అదే అదనపు నీరు అతనిని చంపినట్లు తెలుస్తోంది. గంజాయి ఎక్కువగా సేవించడం వల్ల దాహం ఎక్కువగా అవుతుంది . తద్వారా నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అదనపు భారం పడి మూత్రపిండాలు పనిచేయడం మానేస్తాయి.  అలా బ్రూస్ లీ గంజాయి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ వ్యాధి బారిన పడ్డాడు అని వైద్యులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: