బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ఆది పురుష్.. రామాయణ ఇతిహాస గాధ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి గా.. కృతి సనన్ జానకిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా.. పలువురు భారీ తారాగణంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి టీజర్ విడుదలవగా ఆద్యంతం ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొంది. జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉన్నప్పటికీ వీ ఎఫ్ ఎక్స్ లో తప్పులు సరిచేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ క్రమంలోనే చాలా సమయం పట్టడంతో రిలీజ్ ని వాయిదా వేస్తూ వచ్చే యేడాది జూన్ 16వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే..


అయితే సినిమా వీ ఎఫ్ ఎక్స్ షాట్లను సరి చేసే పనిలో చిత్ర ఇబృందం బిజీగా మారిపోయిందని టెక్నీషియన్లకు మరికొంత సమయం ఇవ్వాల్సి ఉందని.. తెలిపిన ఓం రౌతు జూన్ కల్లా కంప్లీట్ చేస్తారని స్పష్టం చేశారు. అయితే ఈ విషయంపై నమ్మకం లేని కొంతమంది 2024 కు సినిమాను వాయిదా వేస్తున్నారు అంటూ కొన్ని రూమర్స్ సృష్టించారు.  దీంతో అభిమానులు పూర్తిస్థాయిలో నిరాశ చెందారని చెప్పాలి.  కానీ తాజాగా ఇదే విషయంపై చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తూ ఎట్టి పరిస్థితుల్లో జూన్ 16వ తేదీన వచ్చే ఏడాది ఆది పురుష్ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నాము. ఇందులో ఎలాంటి మార్పు లేదు అని స్పష్టం చేశారు.

ఈ చిత్రం కోసం ఇప్పటికే దాదాపు రూ.300 కోట్లను వెచ్చించినట్లు సమాచారం ..ఇప్పుడు మరో రూ.100 కోట్లతో విఎఫ్ఎక్స్ షార్ట్స్ ను సరి చేయనున్నట్లు తెలుస్తోంది.  అంతేకాదు ఇందులో సైఫ్ అలీ ఖాన్ గడ్డాన్ని మార్చడానికి వీ ఎఫ్ ఎక్స్ కోసం అదనంగా రూ. 100 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: