బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ దావన్ సరదాగా చేశాడో.. లేదా సీరియస్ గానే చేశాడో కానీ ఆయన చేసిన కామెంట్స్ మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ లోనే గాక బాలీవుడ్ లో కూడా చాలా చర్చనీయాంశం అయ్యాయి. కృతి సనన్  నీ లిస్టులో ఎందుకు లేదు అంటూ కరణ్ జోహార్ అడిగిన సమయంలో తను ప్రస్తుతం మరొకరి హృదయంలో ఉంది..ఆమె మనసు దోచుకన్న వాడు ప్రస్తుతం దీపిక పదుకునేతో కలిసి బాంబేలో ఒక సినిమా చేస్తున్నాడు అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు.వరుణ్ దావన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రభాస్ చుట్టు సందడి చేస్తున్నాయి. ఎందుకంటే దీపిక పదుకునే ప్రస్తుతం ప్రభాస్ తో ప్రాజెక్ట్ కే సినిమాను చేస్తున్న సంగతి తెల్సిందే. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. అందువల్ల వరుణ్ చెప్పినట్లుగా ప్రభాస్ హృదయంలో కృతి సనన్ ఉందా అంటూ బాలీవుడ్ మీడియా బాగా కోడై కూస్తోంది.


అయితే వీటన్నింటికి దూరంగా ఉండే ప్రభాస్ మాత్రం ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం బాలీవుడ్ మీడియా కథనాలపై  కోపంతో రగిలిపోతున్నారు. పలు రకాల మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ మీడియా కథనాలకు ప్రభాస్ ఫ్యాన్స్  కొంతమంది ఫన్నీగా ఉన్నాయి అంటూ నవ్వుకుంటున్నారు.పైగా ఉమైర్  సంధు అనే డిజస్టర్  క్రిటిక్  ప్రభాస్ ఏకంగా కృతికి  ప్రపోజ్  చేసాడంటూ పోస్ట్ చెయ్యడంతో అభిమానులు ఒక రేంజిలో అతన్ని తిడుతున్నారు.ప్రభాస్ ఇంకా అలాగే కృతి సనన్ ల కాంబోలో  ఆది పురుష్  సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఓం రౌత్  దర్శకత్వం వహిస్తున్నాడు. అందువల్ల ఈ సినిమా షూటింగులో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉండే అవకాశం లేకపోలేదు అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు. అసలు విషయం ఏంటో ఆ కృతి కానీ ప్రభాస్ కానీ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: