తాజాగా డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో అడవి శేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం హిట్ 2. ఈ సినిమా లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కబోతోంది మొదటి సినిమాలో విశ్వక్ సేన్ నటించగా ఈ సినిమా సీక్వెల్లో అడవి శేష్ నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత హిట్ 3,4,5,6,7 సీక్వెల్స్ కూడా ఉంటాయి అని, ఈ సినిమా నిర్మాత నేచురల్ స్టార్ నాని స్పష్టం చేశారు. అంతే కాదు హిట్ 7 లో ఏకంగా ముందు ఆరు సీక్వెల్స్ లో నటించిన హీరోలు ఇందులో కనిపిస్తారని.. ఒక కొత్త ప్రాబ్లంను సాల్వ్ చేసే దిశగా కథను మారుస్తామని దర్శకుడు చెప్పినట్టు ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని స్పష్టం చేశారు. దీంతో ఈ సినిమాలపై ఇప్పటినుంచే అభిమానులలో అంచనాలు పెరిగిపోతున్నాయి.


డిసెంబర్ రెండవ తేదీన సినిమాను విడుదల చేయనున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయగా ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటిస్తున్న విషయం తెలిసిందే.  మరో పాత్రలో కొత్త హీరోయిన్ కోమలి ప్రసాదు కూడా కనిపించనుంది. ఈ సినిమాను ప్రశాంతి త్రిపురనేని , హీరో నానీ లు కలసి నటిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను యూఎస్ఏ లో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 450 కి పైగా లొకేషన్లలో సినిమా విడుదల చేయనున్నట్లు సమాచారం.


డిసెంబర్ 2న సినిమా విడుదల అంటే డిసెంబర్ 1న యూఎస్ఏ లో ప్రీమియర్ షో కూడా వెయ్యనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరొకవైపు ఇండియాలో తెలుగు,  తమిళ్ , కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల చేయబోతున్నారు. ఊహకందని ట్విస్టులతో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు . మరి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: