
అయితే ఈ సినిమా వీ ఎఫ్ ఎక్స్ పనులు జరుగుతున్న నేపథ్యంలో నటీనటులు ప్రస్తుతం రిలాక్స్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వెకేషన్ ఎంజాయ్ చేయడానికి.. కాస్త రిలాక్స్ అవ్వడానికి త్రిష గ్రీస్ వెళ్లినట్లు సమాచారం. దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ సినిమాకే తన పూర్తి సమయాన్ని కేటాయించిన త్రిష ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్ కూడా పూర్తవడంతో ఆమె కాస్త చిల్ అవడానికి గ్రీస్ వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే ఈ సినిమాలో కుందవై అనే పాత్రలో త్రిష నటించిన విషయం తెలిసిందే. ఈమె పాత్రకు ప్రముఖ సింగర్ గీతామాధురి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వ్యవహరించారు..
ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఐశ్వర్యరాయ్ నందిని అనే పాత్రలో నటించి మెప్పించడం జరిగింది. అయితే ఈమె పాత్రకు ప్రముఖ సింగర్ సునీత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వ్యవహరించారు. అయితే ఈ రెండు గొంతులు కూడా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాయి. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. మొత్తానికైతే ఈ సినిమాలో నటించిన నటీనటులకే కాదు ఈ సినిమా కోసం పనిచేసిన ఆర్టిస్టులకు కూడా మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. మొత్తానికి అయితే మొదటి భాగంతో మంచి విజయాన్ని అందుకున్న మణిరత్నం రెండవ భాగంతో ఏ రేంజ్ లో విజయం అందుకుంటాడో చూడాలి.