మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. రావణాసుర ,టైగర్ నాగేశ్వరరావు, ధమాకా సినిమాలతో ఆయన అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమయ్యాడు మాస్ మహారాజా రవితేజ. అయితే ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఆ సినిమాలకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు మాస్ మహారాజా. అయితే త్వరలోనే ధమాకా సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో డిసెంబర్ 23న ఈ సినిమా చాలా గ్రాండ్ గా విడుదల కానుంది .

సినిమా యూనిట్  ఆన్లైన్ రెండిటిలోనూ పూర్తిస్థాయి ప్రమోషన్లను ప్రారంభించడం జరిగింది అయితే తాజాగా మాస్ మహారాజ రవితేజ ఆయన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించడం జరిగింది. ఇందులో భాగంగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు రవితేజ. అయితే ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రీ లీల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రవితేజ. అయితే ధమాకా సినిమాలో కామెడీ టైమింగ్ తో పాటు అభిమానులు ఆశించే డాన్స్ మరియు కమర్షియల్ అంశాలు ఇలా ఎన్నో ఉంటాయి అని రవితేజ పేర్కొన్నారు .

దీంతోపాటు ఈ సినిమాలో తనకు జింతాక్ సాంగ్ చాలా నచ్చింది అని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు దీంతోపాటు ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాను అని ఈ సినిమాను థియేటర్లలో చూస్తే అదిరిపోతుంది అని తప్పకుండా ఈ సినిమాను చూసి అందరూ ఎంజాయ్ చేస్తారని ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీ లీల గురించి ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ఆమె అత్యంత ప్రతిభాశాలి అంటూ మాస్ మహారాజా చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ బుచ్చిబుట్ల సంయుక్తంగా నిర్మించడం జరుగుతుంది. దీంతో స్త్రీలపై మాస్ మహారాజ రవితేజ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: