తమిళ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న తలపతి విజయ్ తాజాగా వారిసు అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తూ ఉండగా ,  నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తెలుగులో వారసుడు అనే పేరుతో విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ చెన్నైలో ఈ మూవీ యొక్క ఆడియో విడుదల వేడుకను భారీ ఎత్తున నిర్వహించింది. ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుకలో భాగంగా వారసు మూవీలో కీలకపాత్రలలో నటించిన శ్రీకాంత్ మాట్లాడుతూ తలపతి విజయ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

శ్రీకాంత్ "వారసు" మూవీ ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ ... తలపతి విజయ్ రియల్ లైఫ్ సూపర్ స్టార్ అని ... అలాగే ఇప్పటివరకు తన కెరీర్ లో ఇంత మంచి మనసున్న గొప్ప హీరోని తాను చూడనేలేదని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. తన కెరీర్ లో ఇప్పటివరకు 125 వరకు మూవీ లలో నటించినప్పటికీ అటువంటి వ్యక్తి నుండి తాను ఇంకా నేర్చుకోవాల్సింది ఉందని తాజాగా అన్నాడు. అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న వారిసు మూవీ తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని ... అలానే పొంగల్ విన్నర్ గా కూడా ఈ మూవీ నిలుస్తుందని ఈ నటుడు తాజాగా అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: