మూవీ ఇండస్ట్రీ ఎప్పుడు విజయం ఉన్నవారినే పట్టించుకుంటుంది.. విజయం ఉంటేనే ఎవరైనా కానీ గుర్తు పెట్టుకుంటారు, గుర్తింపు ఇస్తారు. ఒక్కసారి అపజయంపాలు అయ్యాం అంటే అంతే సంగతులు.

ఐరన్ లెగ్ అని తీసి వారిని పక్కన పెడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా ఇరుక్కుపోయింది పూజ హెగ్డే. కెరియర్ తొలి నాళ్లలో ఐరన్ లెగ్ గా నే పేరు సంపాదించుకుంది ఈ అమ్మడు. తెలుగులో మొదట ఒక లైలా కోసం అంటూ నాగచైతన్య సరసన నటించిన ఈ చిత్రం ఫ్లాప్ అవడంతో ఆమెను అస్సలు ఎవరు గుర్తించలేదు. ఇక ఆ తర్వాత వరుణ్ తేజ్ సరసన ముకుందా సినిమాలో నటించిన కూడా ఆమెకు విజయం రాలేదు.

ఆ తరువాత అల్లు అర్జున్ సినిమా అయినా డీజేలో నటించి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా ఆమె మారిపోయింది. ఈ సినిమా పెద్దగా కమర్షియల్ గా హిట్ కాకపోయినా పూజ హెగ్డే కి మాత్రం మంచి పేరునే ఇచ్చింది. ఇక్కడి వరకు ఆమెకు అన్ని మైనస్ పాయింట్స్.ఆ తర్వాత రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి అని ఐటమ్ సాంగ్ చేసి తిరుగులేని ముద్రని వేసిందని చెప్పవచ్చు . ఇక బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన సాక్ష్యం సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అదే సమయంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమా ఆమెకు మంచి మైలేజ్ ను అయితే ఇచ్చింది. ఇక మహర్షి సినిమాలో మహేష్ బాబు సరసన నటించి మంచి పేరు కొట్టేసింది.

ఇలా వరస హిట్లు సొంతం చేసుకుంటుండడం తో ఆమె మళ్ళీ గోల్డెన్ లెగ్గుగా మారింది.. ఆ తర్వాత వరుణ్ తేజ్ తో మరోసారి గద్దల కొండ గణేష్ తో పాటు హిందీలో హౌస్ ఫుల్ 4 సినిమా కూడా ఆమెకు మంచి పేరుని అయితే తీసుకొచ్చింది. అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో నటించి ఆమె క్రేజ్ ఎలాంటిదో ఇండియన్ సినిమాకు నిరూపించింది. ఇక అఖిల్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్టవడం లో పూజా హెగ్డే ముఖ్య పాత్ర వహించింది.ఇక్కడ వరకు అంతా బాగానే జరిగింది కానీ 2022వ సంవత్సరం ప్రారంభం అవ్వడంతోనే ఆమె ప్లాప్ బాట పట్టింది మొట్టమొదటిగా ఇండియన్ టైటానిక్ గా విడుదలైన రాధే శ్యామ్ అతిపెద్ద ప్లాప్ గా నిలిచింది. ఆ చిత్రం 200 కోట్లకు పైగా నష్టపోయింది. అపజయం అంటూ లేకుండా ఎదురు లేని హీరోగా దూసుకుపోతున్న తమిళ స్టార్ హీరో విజయ్ కి బీస్ట్ సినిమా ద్వారా అతి పెద్ద పరాజయం ఎదురైంది ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇక ఆచార్య సినిమా ఫలితం గురించి మాట్లాడకపోవడమే మంచిది.ఆ తర్వాత బాలీవుడ్ లో స్టార్ హీరోగా అవతరించిన రన్వీర్ సింగ్ కి సర్కస్ సినిమా ద్వారా అతిపెద్ద ఫ్లాప్ పూజా హెగ్డే వల్లే వచ్చిందని అంతా కూడా అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: