టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది అనుపమ పరమేశ్వరన్. తాజాగా ఈమె నటించిన మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడం జరిగింది. మొదట ఈమె నటించిన కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్ హిట్ కొట్టింది ఈమె. దాని అనంతరం ఇటీవల 18 పేజీ స్ సినిమా రిలీజ్ తో కూడా మంచి హిట్ ను తన ఖాతాలు వేసుకుంది అనుపమ  పరమేశ్వరన్ దాని అనంతరం బటర్ఫ్లై అంటూ లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించిన ఈ సినిమా ఓటిటిలో రావడం జరిగింది. ఈ సినిమా కూడా ఎవరు ఊహించిన విధంగా మంచి రెస్పాన్స్ ను అందుకుంది. 

ముఖ్యంగా ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు అని చెప్పాలి. ఇక ఈ సినిమా తన పిల్లలు కిడ్నాప్ అయిన నేపథ్యంలో కొనసాగుతుంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ని నటన ముఖ్యంగా ఆడవారిని బాగా ఆకట్టుకున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇంతటి వరుస విజయాలను అందుకుంటున్న హీరోయిన్ తో ఎవరైనా సరే సినిమా చేయాలి అన్న ఆలోచనతోనే ఉంటారు. అయితే ఈ క్రమంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అరవింద్..ఐకాన్  స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప టు సినిమాలో నటించమని

అనుపమ పరమేశ్వరున్ ని స్వయంగా రిక్వెస్ట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా పేరును సంపాదించుకున్న సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనున్న సంగతి మన అందరికీ తెలిసిందే. పుష్ప సినిమాకి మించేలా ఈ సినిమాను తీసే పనిలో ఉన్నాడు సుకుమార్. ఈ క్రమంలోనే మూడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈమెని సుకుమార్ ఈ సినిమాలో  అల్లు అర్జున్ చెల్లెలి పాత్రలో చూపించినట్లుగా తెలుస్తోంది. దీనికిగాను ఈ వార్త విన్న చాలా మంది అంత పెద్ద స్టార్ హీరోయిన్ ని బన్నీ చెల్లి లాగా ఎందుకు చూపిస్తున్నారు అంటూ కామెంట్లు సైతం చేస్తున్నారు ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: