పవన్ కళ్యాణ్ చేయాల్సిన ఇడియట్ సినిమాను పవన్ రిజెక్ట్ చేయడంతో రవితేజ చేశాడు అయితే ఇలా పవన్ రిజెక్ట్ చేసిన ఇడియట్ సినిమా రవితేజకు ఎంత బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి సినిమాలు రవితేజ కెరియర్ లో చాలా ఉండగా.. గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్లో తరకెక్కిన ఓ హిట్ మూవీ కూడా ముందుగా వేరే హీరోకి కథ వినిపించి. తర్వాత వాళ్లు రిజెక్ట్ చేయడంతో రవితేజ చేశాడట. ఆ సినిమా ఏదో కాదు క్రాక్. అప్పటికే డాన్ శీను, బలుపు లాంటి సినిమాలు గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్లో వచ్చి హిట్టు కొట్టాయి వీరి కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన సినిమా క్రాక్. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది.
ఇక ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన రవితేజ మరోసారి తన అదిరిపోయే యాక్షన్ తో ప్రేక్షకులను మిస్మరైజ్ చేశాడు అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన శృతిహాసన్ నటించి పర్ఫెక్ట్ జోడి అనిపించింది. అయితే ముందుగా ఈ సినిమాను రవితేజతో తీయాలని అనుకోలేదట దర్శకుడు గోపీచంద్ మలినేని. మొదట వెంకటేష్ కు క్రాక్ సినిమా కథల వినిపించాడు. కానీ ఎందుకో వెంకటేష్ కు మాత్రం ఈ సినిమా కథ నచ్చలేదు అని చెప్పి రిజెక్ట్ చేశాడట. ఇక ఆ తర్వాత గోపీచంద్ మలినేని రవితేజకు కథ వినిపించడం.. రవితేజకు ఈ కథ పిచ్చపిచ్చగా నచ్చడం.. వెంటనే ఓకే చేయడం చకచక జరిగింది. వీరి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా 2017 సంవత్సరం తర్వాత రవితేజకు ఎన్నో ఫ్లాప్ ల తర్వాత సూపర్ హిట్ ఇచ్చింది అని చెప్పాలి.