మాస్ మహారాజ రవితేజ తాజాగా ధమాకా అనే మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గ నటించగా ... రావు రమేష్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ డిసెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటివరకు ఈ సినిమా 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 10 రోజుల్లో ఈ సినిమా రోజు వారిగా ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మొదటిరోజు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 5.46 కోట్ల షేర్ , 9.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.  రెండవ రోజు ఈ సినిమా 3.98 కోట్ల షేర్ ,  7.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. మూడవ రోజు ఈ సినిమా 5.93 కోట్ల షేర్ ,  11.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. నాలుగవ రోజు ఈ సినిమా 3.55 కోట్ల షేర్ , 6.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఐదవ రోజు ఈ సినిమా 2.64 కోట్ల షేర్ ,  5.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఆరవ రోజు ఈ సినిమా 2.02 కోట్ల షేర్ ,  3.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.


ఏడవ రోజు ఈ సినిమా 1.64 కోట్ల షేర్ ,  3.5 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 8 వ రోజు ఈ సినిమా 1.81 కోట్ల షేర్ ,  3.5 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 9 వ రోజు ఈ సినిమా 2.44 కోట్ల షేర్ ,  4.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 10 వ రోజు ఈ సినిమా 4.90 కోట్ల షేర్ ,  9.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా 10 రోజులకు గాను ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 34.37 కోట్ల షేర్ ... 65.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: