నందమూరి బాలకృష్ణ సినిమాలే కాకుండా ప్రస్తుతం ఆహా లో  ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ షో కి పోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ షోలో మొన్నటి వరకు ప్రభాస్ వచ్చి ఆహా యాప్ ని క్రాష్ చేసి వెళ్లడం జరిగింది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ప్రసారమైన ఆ ఎపిసోడ్ ఎంతటి రికార్డును సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా ఆ రికార్డును తిరగరాయడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ షో కి వస్తున్నాడు.ఇక  పవన్ కళ్యాణ్ ఇలాంటి ఒక షోకి రావడం ఇదే మొదటిసారి అందులోనూ బాలయ్య హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షో కి 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావడంతో ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ ఎపిసోడ్కి సంబంధించిన షూటింగ్ను పూర్తి చేసుకున్నప్పటికీ చాలామంది ఈ షోలో బాలయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అన్న దాని కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. చాలావరకు బాలయ్య అడిగిన ప్రశ్నలకి గట్టి సమాధానాలు ఇచ్చారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగానే బాలకృష్ణ తన మూడు పెళ్లిళ్ల గురించి ఆయన తీసుకునే ఆహారం గురించి ఇంకా టిడిపి పొత్తు గురించి అనేక రకాల ప్రశ్నలను అడిగాడట బాలయ్య.

ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ను బాలయ్య చిరంజీవి గురించి కూడా కొన్ని ప్రశ్నలను అడిగినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే అన్నయ్య చిరంజీవి దగ్గర నుండి నువ్వు ఏం నేర్చుకున్నావు అని బాలయ్య అడిగాడట దీనికిగాను పవన్ కళ్యాణ్ అన్నయ్య నుంచి కష్టపడే స్వభావం నేర్చుకున్నాను దానివల్ల ఇప్పుడు ఇలా ఉన్నాను అంటూ చెప్పాడట పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ప్రస్తుతం కొన్ని దశాబ్దాలుగా స్టార్ హీరోగా చలామణి అవుతున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.!!

మరింత సమాచారం తెలుసుకోండి: