టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంత వయసు వచ్చినప్పటికీ ప్రస్తుతం వారు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు నాగార్జున. అయితే 2002 లో నాగార్జున హీరోగా గ్రేసీసింగ్ మరియు శ్రియ హీరోయిన్లుగా నటించిన సంతోషం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. మే 9న విడుదలైన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఒక పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయి మరియు అబ్బాయి ప్రేమించుకుని కుటుంబాన్ని కాదని ఇంట్లో నుండి వెళ్లిపోయి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటారు. ఇక అనుకోకుండా ఒక ప్రమాదం జరగడంతో ఆ ప్రమాదంలో ఆమె చనిపోతుంది.

దీంతో ఈ సినిమాలో హీరోయిన్ చనిపోవడంతో తన భర్త మరియు కుటుంబంలో ఏ మాత్రం సంతోషం ఉండదు. అయితే ఈ క్రమంలోనే చివరికి మళ్ళీ అలాంటి సంఘటన జరిగితే ఆఖరికి ఏం జరుగుతుంది అనేది ఈ సినిమా యొక్క కథాంశం.టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున నటించిన ఈ సినిమా అప్పట్లో వంద రోజులు ఆడింది. అయితే ఈ సినిమాలో నాగార్జునకి కొడుకుగా లక్కీగా నటించిన మాస్టర్ అక్షయ్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక ఈ సినిమాలో భాగంగానే బాయ్ బాయ్ సింహరాజు అంటూ కామెడీ సీన్లలో నటిస్తూనే నాగార్జునతో కలిసి ఎమోషనల్ సీన్లలో నటించాడు ఈయన. 

అయితే నాగార్జున నటించిన ఈ సినిమా వచ్చి దాదాపు 21 ఏళ్లకు పైగా అన్ని కావస్తుంది. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా  ఆ సినిమాలో నటించిన కుర్రాడు ఇప్పుడు బాగా పెద్దవాడు అయిపోయాడు. ప్రస్తుతం అతనికి సంబంధించిన ఫోటోలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇటీవల సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన వాంటెడ్ సినిమాలో ఇతను హీరోయిన్ తమ్ముడిగా నటించడం జరిగింది. అంతేకాదు పలు యాడ్లలో కూడా నటిస్తున్నాడు ఈయన..!!

మరింత సమాచారం తెలుసుకోండి: