చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేర్ వీరయ్య. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. కీలకమైన పాత్రలో రవితేజ కూడా నటించబోతున్నారు. ఇక వాల్తేర్ వీరయ్య సినిమా టైటిల్ వేనుక జరిగిన ఇంట్రెస్టింగ్ స్టోరీ ను డైరెక్టర్ బాబి తాజాగా రివిల్ చేయడం జరిగింది. ఈ సినిమా కథ టైటిల్ తోనే రాసుకున్నానని తెలియజేశారు డైరెక్టర్ బాబి. సాధారణంగా అయితే సినిమా కథ అంత రాసిన తర్వాత చివరిలో టైటిల్ అనుకుంటారు. కానీ వాల్తేర్ వీరయ్య సినిమా కథ మాత్రం టైటిల్ ముందే అనుకొని రాశానని తెలియజేశారు.

వెంకీ మామ సినిమా సమయంలో నాజర్ గారు ఒక బుక్కు ఇవ్వగా.. అందులో వీరయ్య పాత్ర తనకు బాగా నచ్చిందని అప్పటినుంచి ఆ పేరు మైండ్లో అలాగే ఉండిపోయిందని తెలియజేశారు. మరొక పక్క చిరంజీవి సినిమాల్లోకి వెళ్ళకముందు వారి నాన్నగారి స్నేహితుడు ఫోటోషూట్స్ కోసం డబ్బులు ఇచ్చేవారట. ఇక ఆయన పేరు కూడా వీరయ్య అని తెలిసిందని తెలిపారు. అలా వీరయ్యకు వాల్తేర్ యాడ్ చేసి వాల్తేర్ వీరయ్య అనే టైటిల్ ని సెట్ చేశానని తెలియజేశారు డైరెక్టర్ బాబి.ఇక ఈ సినిమాలో ప్రతి సిను కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్మెంట్ చేసే విధంగా ఉంటుందని.. మెగా ఫ్యాన్స్ కి పక్కా మాస్ ట్రీట్ అందిస్తానని తెలియజేశారు బాబి. ఈ పొంగల్ కి వాల్తేరు వీరయ్య సినిమా ఖచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుందని తెలియజేశారు. మరి ఒకేసారి బాలయ్య, చిరంజీవి పోటీపడుతున్న ఈ సంక్రాంతికి ఎవరు విజేతగా నిలుస్తారో తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక చిరంజీవిసినిమా అయిపోయిన వెంటనే భోళా శంకర్ సినిమా ప్రమోషన్లు పాల్గొనబోతున్నారని సమాచారం. ఈ సినిమా కూడా సిస్టర్ సెంటిమెంట్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: