మాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం ఏకంగా మూడు మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పోయిన సంవత్సరం మొదటగా రవితేజ ఖిలాడి మూవీ తో ప్రేక్షకులను పలకరించగా ... ఆ తర్వాత రామారావు ఆన్ డ్యూటీ ... ఆ తర్వాత ధమాకా మూవీతో ప్రేక్షకులను ముందుకు వచ్చాడు. ఇందులో భాగంగా ఖిలాడి మరియు రామారావు అన్ డ్యూటీ మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాలను అందుకున్నాయి.

అలా పోయిన సంవత్సరం వరుసగా రెండు అపజాయలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న రవితేజ పోయిన సంవత్సరం డిసెంబర్ 23 వ తేదీన ధమాకా మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సెడ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 18.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇలా భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు 19 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 43.16 కోట్ల షేర్ ను ... 81.32 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. దానితో ఈ సినిమా 19 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 24.16 కోట్ల లాభాలను అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: