ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం రౌడీ హీరోగా కొనసాగుతున్నాడు విజయ్ దేవరకొండ. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరియర్ ని ప్రారంభించిన ఈ హీరో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు పొందడం అంటే మామూలు విషయం కాదు. ఈ స్థాయికి రావడానికి విజయ్ దేవరకొండ ఎన్నో కష్టాలను పడ్డాడు. ఇక అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అర్జున్ రెడ్డి అనే సినిమాతో స్టార్ హీరో అయ్యాడు. విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తరికెక్కిన ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కి ఎవరు ఊహించిన విధంగా క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో అర్జున్ పాత్రకి విజయ్ దేవరకొండ తప్ప మరొక హీరో అయితే సెట్ అయ్యేవాడు కాదు 

అన్న విధంగా ఆ పాత్రలో లీనమై నటించాడు విజయ్. ఈ సినిమా అనంతరం గీతాగోవిందం సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. అతి తక్కువ బడ్జెట్ తో విడుదలైన ఈ సినిమా వందల కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాతో విజయ్ ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా వరుస హిట్ సినిమాలతో దోసుకుపోతున్న సమయంలో నోట సినిమాలో నటించి తప్పు చేశాడు ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. రెండు సినిమాల విజయాల అనంతరం ఒక సినిమా ఫ్లాప్ అయితే ఏం కాదు అని భావించిన సమయంలో టాక్సీవాలా సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. విజయ్ విజయ్ కి ఉన్న క్రేజ్ వల్లే ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా హిట్ అయింది.

దాని అనంతరం ఆయన నటించిన రెండు సినిమాలు కూడా డిజాస్టర్లుగా నిలిచాయి.అయితే ఈ క్రమంలోనే పాన్ ఇండియా రేంజ్ లో లైగర్ సినిమాతో మళ్లీ ఏంట్రా ఇచ్చాడు విజయ్ .ఇక ఈ సినిమా గురించి మిశ్రమ స్పందన దక్కినప్పటికీ అంతగా ఎవరిని ఆకట్టుకోలేదు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లలో ఈ సినిమా గురించి భారీ బజ్ ను క్రియేట్ చేయడం వల్లే ఓపెనింగ్స్ భారీ స్థాయిలో వచ్చాయి. అయితే ప్రస్తుతం విజయ్ లైగర్ సినిమా తర్వాత ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. శివానిర్వాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ కి జోడిగా సమంత నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే సమంత అనారోగ్యం కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. దీంతో అయోమయంలో పడ్డాడు విజయ్. ఈ సినిమా పూర్తి అయితే తప్ప మరో సినిమా చేయడానికి అవకాశం లేదు. ఆ మధ్య సుకుమార్ తో విజయ ఒక సినిమా చేయనన్నాడు అన్న వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమా షూటింగ్ పూర్తి అయితే తప్ప విజయ్ మరో సినిమా చేసే అవకాశం లేదు. దీంతో ఎటు వెళ్ళాలో తెలియక అయోమయంలో పడ్డాడు విజయ్ దేవరకొండ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: