
ఆ తర్వాత ఆ కాలంలో రైటర్ గా కూడా ఫుల్ బిజీగా మారిపోయాడు అటు ఈటీవీలో ప్రసారమయ్యే ఎన్నో కార్యక్రమాలకు స్క్రిప్ట్ కూడా అందిస్తూ రెండు చేతులారా సంపాదిస్తున్నాడు అని చెప్పాలి. అదే సమయంలో వెండి ధరపై అవకాశాలు అందుకుంటూ అదరగొడుతున్నాడు. అయితే గత కొంతకాలం క్రితం జబర్దస్త్ నుంచి దూరంగా ఉండి కేవలం శ్రీదేవి డ్రామా కంపెనీ సహా మరికొన్ని కార్యక్రమాలలో కనిపించిన హైపర్ ఆది మొన్నటికి మొన్న మళ్లీ జబర్దస్త్ లోకి వచ్చాడు అన్న విషయం తెలిసిందే.
అయితే ఇక జబర్దస్త్ లోకి వచ్చి రెండు మూడు ఎపిసోడ్లలో కనిపించాడో లేదో మళ్లీ జబర్దస్త్ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఇలా జబర్దస్త్ నుంచి హైపర్ ఆది తప్పుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయంపై ఎప్పుడూ చర్చ జరుగుతూ ఉంటుంది. కాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించి విడుదలైన లేటెస్ట్ ప్రోమోలో కూడా ఇందుకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. కొత్త యాంకర్ సౌమ్య రావు కారణంగానే హైపర్ ఆది జబర్దస్త్ వీడాడు అనే టాక్ ఉంది. ఇది ఎంతవరకు నిజం అంటూ రష్మీ ప్రశ్నించగా హైపర్ ఆది ఏదో సమాధానం చెప్పాడు. కానీ ఇక అతని వాయిస్ మ్యూట్ చేయడంతో అతను ఏం చెప్పాడో ఎవరికీ అర్థం కాలేదు. దీంతో ఇక ఈ కార్యక్రమం చూసేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.