తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వారిలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. మొదట పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్ లోని నటించిన విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారారు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా రౌడీ హీరోగా కూడా పేరు పొందారు. చివరిగా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేసిన లైగర్ చిత్రం  భారీగా డిజాస్టర్ అయ్యింది. దీంతో విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాల పైన ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ఇక విజయ్ దేవరకొండ 12వ చిత్రాన్ని ముహూర్తం కుదిరింది. ప్రస్తుతం శివా నిర్మాణంలో ఖుషి సినిమాలో నటిస్తున్న విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ విడుదల చేశారు. జెర్సీ ఫేమ్ గౌతం తిన్ననూరు దర్శకత్వంలో విజయ్ దేవరకొండ తన తదుపరిచిత్రాన్ని తీయబోతున్నట్లు ప్రకటించారు. ఈ కాంబోలో సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఇటీవల స్క్రిప్ట్ లాక్ అయిన సంగతి తెలిసింది. ఈ సినిమాకు ఫ్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే రామ్ చరణ్ చెప్పిన కథతోనే విజయ్ దేవరకొండ సినిమా ఉంటుందా లేకపోతే విజయ్ దేవరకొండ కోసం ఇంకొక కథ ఆడి చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది. డైరెక్టర్ గౌతం తిన్ననూరి సినిమాతో బ్యాక్ టు బ్యాక్ వరుసగా హిట్లు అందుకుంటూనే ఉన్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఒక పోస్టర్ని విడుదల చేయగా.. ఇందులో విజయ్ దేవరకొండ కాప్ లుక్ ను విడుదల చేశారు. దీంతో నెటిజన్లు విజయ్ దేవరకొండ పైన పలు రకాలుగా ట్రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ దేవరకొండ కేవలం సినిమాతోనే నేను సమాధానం చెబుతానంటూ బదులిచ్చినట్లుగా సమాచారం. ఏది ఏమైనా విజయ్ దేవరకొండకు ప్రస్తుతం సరైన సక్సెస్ కావాలని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: