సాధారణంగా క్యారెక్టర్ ఆర్టిస్టులు అన్న తర్వాత ఎన్నో రకాల పాత్రలు చేస్తూ ఉంటారు అని చెప్పాలి . ఈ క్రమంలోనే తమ వైవిద్యమైన నటనతో ఎప్పుడూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు. కానీ కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులకు మాత్రం ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు వస్తూ ఉంటాయి. అంతేకాదు ఇక ఆ పాత్రలకు సంబంధించిన ఎండింగ్ కూడా ఒకేలాగా ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి తరహా పాత్రలలో నటించి ప్రేక్షకులను ఇప్పించిన వారిలో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న రాజీవ్ కనకాల కూడా ఉన్నారు అని చెప్పాలి.


 ఈయన సినిమాల్లో హీరో స్నేహితుడు పాత్రలో నటించిన అన్నయ్య పాత్రలో నటించిన చివరికి ఎలాంటి పాత్రలో నటించిన కూడా ఇక రాజీవ్ కనకాల పాత్ర చివరికి సినిమాలో చనిపోతుంది. ఇలాంటి పాత్రలనే దాదాపు 14 సినిమాల్లో చేశారు ఆయన. అంతే కాదండోయ్ ఇక రాజీవ్ కనకాల పాత్ర సినిమాలో చనిపోయిందంటే ఇక సినిమా హిట్ అవుతుంది అనే ఒక టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది అని చెప్పాలి. ఇప్పటివరకు రాజీవ్ కనకాల చనిపోయే పాత్రలో నటించిన సినిమాలు చూసుకుంటే..



 స్వామి, అశోక్, రాజు గారి గది 2, ఫిలిం బై అరవింద్, అతడు, హరే రామ్, దూకుడు, అతిధి, బాద్షా, రాజా ది గ్రేట్, రంగస్థలం, బింబిసారా ఇక మొన్నటికి మొన్న వచ్చిన వీర సింహారెడ్డి సినిమాల్లో కూడా చనిపోయే పాత్రలో నటించారు రాజీవ్ కనకాల. ఇక ఈ అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ సాధించాయి అని చెప్పాలి. దీంతో ఇక రాజీవ్ కనకాల పాత్ర సినిమాలో చనిపోయిందంటే ఆ సినిమా సూపర్ హిట్ కావడం ఖాయం అని ప్రేక్షకులు కూడా అనుకుంటూ ఉన్నారట . ఏదేమైనా ఇక ఇలా ఎక్కువగా చనిపోయే పాత్రల్లో మాత్రం అటు రాజీవ్ కనకాలనే కనిపిస్తాడు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: