కాంతారా.. ఈ కన్నడ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం కన్నడలో మాత్రమే విడుదల చేయాలని తెరకెక్కించిన ఈ చిన్న సినిమా వందల కోట్ల లాభాలను తెచ్చిపెట్టి నిర్మాతల పంట పండేలా చేసింది. ఇక నాచురాలిటీకి దగ్గరగా సాంప్రదాయాలను గుర్తుచేసే విధంగా సరికొత్త కథ కథనంతో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు హీరో రిషబ్ శెట్టి. ఇక ఈ సినిమాలోని ప్రతి ఎలిమెంట్ కూడా అటు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది అని చెప్పాలి. అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 అయితే ఇక ఈ సినిమాలో డి గ్లామర్ పాత్రలో నటించిన సప్తమి  గౌడ ఒక్కసారిగా తన నాచురల్ అందాలతో ప్రేక్షకులందరూ కూడా ఆకట్టుకుంది అని చెప్పాలి. అంతేకాదు తన నటనతో కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కాంతారా సినిమాలో ఇక సప్తమి గౌడ నటించిన పాత్రకి కూడా మంచి స్కోప్ వుండడంతో ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేసులోకి వచ్చేసింది. అయితే కాంతారా సూపర్ హిట్ తరువాత ఇక ఇప్పుడు సప్తమి గౌడ వరుస అవకాశాలు అందుకుంటుంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఒక పాన్ ఇండియా మూవీలో నటించే బంపర్ ఆఫర్ కొట్టేసిందట.

 ది కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమాతో గత ఏడాది సంచలనం సృష్టించాడు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్ అగర్వాల్. కాగా ఈ కాంబినేషన్లో మరో సినిమా రాబోతుందట. ది వ్యాక్సిన్ వార్ పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుపుతున్నారని తెలుస్తుంది. ఇందులో హీరోయిన్గా కీలక పాత్ర కోసం కాంతారా బ్యూటీని సెలెక్ట్ చేశారట చిత్ర బృందం. కరోనా వైరస్ అల్లకల్లోలం   సృష్టిస్తున్న వేళ వ్యాక్సిన్ కనుగొనేందుకు శాస్త్రవేత్తలు పడిన కష్టం ఇక వాక్సిన్ కరోనా వైరస్ ను కట్టడి చేసిన విధానం ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: