యంగ్ రెబల్ స్టార్ మరియు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం చేతునిండా వారు సినిమాలతో బిజీగా ఉన్నాడమ్ డార్లింగ్ అభిమానులు ప్రస్తుతం ఆయన సినిమా చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రాజెక్టు కె సలార్  సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా ఈ నేపథ్యంలోనే మరోవైపు డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న చిత్రీకరణ కూడా సైలెంట్ గా జరుగుతుంది అని తెలుస్తుంది.వీటితోపాటు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష సినిమా కి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. 

ఇక ఈ సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది అని తెలుస్తుంది. అయితే గతంలో ఈ సినిమా కి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు చిత్ర బృందం. ఇక టీజర్ ని విడుదల చేసిన అనంతరం ఈ టీజర్ పై రకరకాల విమర్శలు రావడం జరిగింది . ఈ సినిమా టీజర్ బాలేదని ఈ సినిమా యొక్క వి ఎఫ్ ఎక్స్ మార్చే పనిలో పడ్డారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ సినిమా టీజర్ పై విమర్శలు రావడంతో ఈ సినిమా యొక్క విఎఫ్ఎక్స్ మార్చే పనిలో ఈ సినిమాని 2023 జూన్ 16న విడుదల చేయాలని భావించారు చిత్ర బృందం. అందులో భాగంగానే ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది.

అయితే తాజాగా దీనికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇందులో భాగంగానే ఈ సినిమా అనుకున్న తేదీకి రిలీజ్ కాదు అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  తాజాగా ఈ వార్త స్పందించారు చిత్ర బృందం.తాజాగా ఈ సినిమా యొక్క రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా జూన్ 16న రిలీజ్ అవ్వడం ఖాయమని నిర్ధారిస్తూ చిత్రబృందం ఒక ప్రకటన విడుదల చేశారు.ప్రభాస్ ని రాముడిగా చూడాలి అంటే ఇంకో 150 రోజులు కచ్చితంగా ఆగాల్సిందే అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ చూసిన ప్రభాస్ అభిమానులు ఈ సినిమా చూసేందుకు ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమా రామాయణ ఇతిహాసాల ఆధారంగా తనకెక్కనుంది. కాగా ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్గా నటిస్తోంది.ఇందులో భాగంగానే బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో రావణుడిగా కనిపించనున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: