రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ ఇంకా రామ్ చరణ్ లతో తీసిన rrr సినిమా చూశాకా ఇరు హీరోల ఫ్యాన్ మధ్య సోషల్ మీడియా వార్స్ జరిగాయి.కారణం ఇందులో ఎన్టీఆర్ పాత్రని రాజమౌళి రామ్ చరణ్ కంటే కొంచెం తక్కువగా చూపించడం. ఈ సినిమా చూసిన ఎన్టీఆర్ అభిమానులు మన ఎన్టీఆర్‌కు రాజమౌళి అంత అన్యాయం చేసాడు..? మొత్తం కథ అంతా కూడా రామ్ చరణ్ చుట్టూనే నడిపించేసాడేంట్రా..?  ఎన్టీఆర్‌కు చాలా అన్యాయం జరిగింది.అంటూ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు.అయితే అందులో నిజం కూడా లేకపోలేదు.. అన్యాయం జరిగిందో లేదో తెలియదు కానీ ఆర్.ఆర్.ఆర్ కథని నడిపించేది మాత్రం రామ్ చరణ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించినపుడు హెచ్చు తగ్గులు అనేవి కచ్చితంగా ఉంటాయి. మా హీరోను తగ్గించారు.. ఆ హీరోను పెంచారు అనే గొడవలు కూడా జరుగుతాయి. కానీ ఆస్కార్‌ అవార్డుల దగ్గరికి వచ్చేసరికి.. కొన్ని రోజులుగా కేవలం ఎన్టీఆర్ పేరు మాత్రమే బాగా వినిపిస్తుంది.. చరణ్ పేరు అస్సలు అందులో కనిపించడం లేదు.


ఇండియాలో అయితే చరణ్, ఎన్టీఆర్.. ఇద్దరి నటనకు బాగా ఫిదా అయిపోయారు ఆడియన్స్. అదే గ్లోబల్ ఆడియన్స్ అయితే ఎక్కువగా ఎన్టీఆర్ కి సలాం కొడుతున్నారు. అందుకు ముఖ్యంగా మూడు సన్నివేశాలే కారణం అని తెలుస్తుంది. సినిమాని రామ్ చరణ్ అంతా లీడ్ చేసినా.. పులితో ఎంట్రీ సీన్ ఇంకా ఇంటర్వెల్‌లో జంతువులతో వచ్చే ఇంట్రో సీన్ అలాగే సెకండాఫ్‌లో కొమరం భీముడో పాటతో అకాడమీ సభ్యుల్ని తారక్ తన వైపు తిప్పుకున్నట్లు సమాచారం తెలుస్తుంది.ఆర్ ఆర్ ఆర్‌లో ఎన్టీఆర్‌కు పడిన ఈ మూడు సీన్స్ ఆస్కార్స్‌లో చర్చకు తెర తీసాయని అంతేగాక ఆ సీన్స్ లో తారక్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌కు వాళ్లు ఫిదా అయిపోయారని ప్రచారం జరుగుతుంది. జనవరి 24 వ తేదీన ప్రకటించబోయే ఆస్కార్స్ బెస్ట్ యాక్టర్ షార్ట్ లిస్టులో ntr పేరు ఖాయమని వెరైటీ మ్యాగజైన్ కూడా రాసుకొచ్చింది. అమెరికా వెబ్‌సైట్.. ‘USA Today’  కూడా ఇదే విషయాన్ని రాసుకొచ్చింది. ఒకవేళ అదే కనుక నిజమైతే తారక్ ఆస్కార్ రేసులో నిలిస్తే మాత్రం అంతకంటే సంచలనం మన ఇండియాకి గర్వకారణం మరోటి ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: