
అందుకే వరుసగా మరో నాలుగు పాన్ ఇండియా సినిమాలు లైన్ లో ఉన్నాయి. వాటిలో ఓం రౌత్ తీస్తున్న ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ ఎప్పుడు చేయాలా అన్న సంధిగ్దములో పడ్డారు. ఇక ప్రశాంత్ నీల్ తో చేస్తున్న "సలార్" కూడా వేగంగా షూటింగ్ ను జరుపుకుంటోంది.. ఇవి కాకుండా స్పిరిట్ మరియు ప్రాజెక్ట్ కె లు ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉన్నాయని చెప్పాలి. ఇక మధ్యలో కుటుంబ కథాంశాలను తెరకెక్కించే డైరెక్టర్ మారుతితో ఒక చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.
ప్రభాస్ కెరీర్ లో డార్లింగ్ మరియు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలలాగా ఆద్యంతం మంచి ఎమోషన్, కామెడీ , సెంటిమెంట్ లతో ప్రేక్షకులను రంజించేయడానికి వర్క్ అవుట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా జరుపుకుంటోందట, తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను 2024 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. మరి ప్రభాస్ తో సంక్రాంతికి ఇంకే సినిమాలు పోటీగా రానున్నాయో తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే.