అషు రెడ్డి..ఈమె సోషల్ మీడియాలో అడుగు పెట్టిన తర్వాతనే బుల్లితెరపై పరిచయం అయింది. ఆమె మొదట్లో సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలతో ఆమె బాగా ఫేమస్ అయింది. చూడటానికి సమంతలా ఉన్న అషు రెడ్డి కు బాగా ఫాలోయింగ్ కూడా పెరిగింది. అతి తక్కువ సమయంలో తన కెరీర్ మొత్తం మారిపోయింది. ఇక సినిమాల్లో నటించాలని ఆసక్తి కూడా కలుగగా చల్ మోహన్ రంగా సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించింది.

ఇక ఆమెకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమని పలుమార్లు కూడా చెప్పుకొచ్చింది. అతనిపై ఉన్న ఇష్టం మరియు అభిమానం తనకు పీకల మీద ఉండటంతోపాటు ప్రైవేట్ పార్టులో ఆయన పేరుతో ఉన్న టాటూలను వేసుకోవడమే కాకుండా అది చూపించింది కూడా. ఆ మధ్య ఆయన తో దిగిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ.. ఆయనతో నటించాలని కోరిక కూడా ఉందని చెప్పింది.

ఇక ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై ఓ రేంజ్ లో అయితే దూసుకుపోయింది. పైగా ఇటీవలే పూర్తయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా అవకాశం అందుకొని మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ బ్యూటీ తన గ్లామర్ తో మాత్రం కుర్రాళ్ళను పిచ్చెక్కించింది. నిజానికి ఈ బ్యూటీ ఇంట్లో కంటే ఎక్కువగా నెట్టింట్లో అయితే గడుపుతుంది. ఈమె గతంలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో చేసిన రచ్చ అంతా ఇంతా అయితే కాదు.

వీరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అప్పట్లో తెగ పుకార్లు వచ్చాయి. ఇక బుల్లితెరలో ప్రసారమైన కామెడీ స్టార్ అనే కామెడీ షోలో లేడీ కమెడియన్ గా అడుగు పెట్టి తన కామెడీతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక అక్కడ కూడా మరో కమెడియన్ ఎక్స్ప్రెస్ హరితో తెగ రెచ్చిపోయింది. ఏకంగా ముద్దులు పెట్టి అలాగే హగ్ లు ఇచ్చి అందరి దృష్టిలో పడింది. ఆ తర్వాత యాంకర్ రవి తో కలిసి ఓ షోలో యాంకర్ గా కూడా చేసి బాగా రెచ్చిపోయింది.

నిజానికి రెండుసార్లు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టింది అంటే తర్వాత తన పొజిషన్ ఏంటో క్లియర్ గా నే అర్ధం అవుతుంది. ఇక బిగ్ బాస్ తర్వాత మళ్లీ నెట్టింట్లో తన రచ్చ బాగా మొదలు పెట్టింది. ప్రతి రోజు ఫోటోలు షేర్ చేసుకుంటూ ఎక్కువ లైకులు సంపాదించుకుంటుంది.

అప్పుడప్పుడు ఈమె చేసే పోస్టులను చూసి నెటిజన్లు కూడా దారుణమైన ట్రోల్స్ మరియు కామెంట్లు పెడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే ఇటీవలే తాను షేర్ చేసుకున్న పోస్ట్ కు కూడా బాగా ఎక్కువ కామెంట్లు వస్తున్నాయి. ఇన్స్టాల్ ఒక వీడియో పంచుకోగా అందులో ఒక రీల్ ను చేసింది. అదేంటంటే.. సన్నాఫ్ సత్యమూర్తి లో నిత్యమీనన్, అల్లు అర్జున్ మధ్య పెళ్లి గురించి ఒక డైలాగ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. నిత్యమీనన్ తనని పెళ్లి చేసుకున్న వాడిని పాలలో విషయం ఇచ్చి చంపేస్తాను అనే డైలాగు అషు కూడా కొట్టగా.. ఫస్ట్ నువ్వు వైఫ్ మెటీరియల్ అని ఎలా ఫిక్స్ అయ్యావ్ పాప? అని ట్రోల్ చేశారు నెటిజన్స్. ఇక మరో నెటిజన్ చంపేసిన చంపేస్తావు అంటూ కామెంట్ కూడా పెట్టారు.03:49 PM

మరింత సమాచారం తెలుసుకోండి: