తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటువంటి నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య కొంత కాలం క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి పరశురామ్ దర్శకత్వంలో ఒక మూవీ చేయబోతున్నట్లు ఒక వార్త వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఆ తర్వాత దర్శకుడు పరుశురామ్ కు మహేష్ బాబు తో మూవీ చేసే అవకాశం రావడంతో నాగ చైతన్య దగ్గరుండి మహేష్ మూవీ తో పరశురామ్ మూవీ ని ఓకే చేసినట్లు దానితో నాగ చైతన్య ... పరశురామ్ కాంబినేషన్ మూవీ తాత్కాలికంగా ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే పరశురామ్ ఇప్పటికే మహేష్ తో సర్కారు వారి పాట అనే మూవీ ని తెరకెక్కించాడు. అలాగే ఆ మూవీ ఇప్పటికే విడుదల అయ్యి మంచి విజయం కూడా సాధించింది. దానితో పరుశురామ్ తన తదుపరి మూవీ ని నాగ చైతన్య తో చేయబోతున్నట్లు ... కథ కూడా లాక్ అయినట్లు కొన్ని వార్తలు వచ్చాయి.

అలాగే ఈ మూవీ ని 14 రీల్స్ బ్యానర్ వారు నిర్మించబోతున్నట్లు కూడా కథనాలు బయటకు వచ్చాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నాగ చైతన్య ... పరశురామ్ కాంబినేషన్.l లో 14 రీల్స్ బ్యానర్ వారు నిర్మించబోయే సినిమా ప్రస్తుతానికి ఆగిపోయినట్లు తెలుస్తోంది. మరి త్వరలోనే ఈ మూవీ కి సంబంధించి ఏదైనా ప్రకటన వస్తుందేమో చూడాలి. నాగ చైతన్య ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న కస్టడీ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: