
అయితే వీర సింహారెడ్డి సినిమాలో యాక్షన్ మాత్రమే ఎక్కువగా ఉంటే అటు వాల్తేరు వీరయ్య సినిమాలో మాత్రం చిరంజీవి స్టైల్ ఎంటర్టైన్మెంట్ ఇక వింటేజ్ చిరుని మరోసారి ప్రేక్షకులు చూస్తారు. ఇక ఇదే ఈ సినిమాకు మరింత ప్లస్ పాయింట్ గా మారిపోయింది. వాల్తేరు వీరయ్యలో ఇక మరోసారి చిరంజీవి తనదైన శైలిలో ఎంటర్టైన్మెంట్ పండించిన విధానంతో ప్రేక్షకులందరూ మైమరిచిపోతున్నారు. అయితే ఎప్పటిలాగానే ఈ సినిమాలపై నెగటివ్ కామెంట్స్ వచ్చాయి అని చెప్పాలి. అసలు చిరంజీవి ఈ సినిమాలో ఏం చేశాడని.. కథలో కూడా పెద్దగా బలం లేదు అంటూ అందరూ కామెంట్ చేస్తుండగా ఇదే వ్యాఖ్యలపై ఇక సినీ ఇండస్ట్రీలో పెద్దాయనగా కొనసాగుతున్న నిర్మాత తమ్మరెడ్డి భరద్వాజ్ స్పందించారు.
ఈ వయసులో కూడా అలా చేయడం చాలా కష్టం. చిరు ఒక ఫ్యామిలీ ఎమోషన్ తో ఉన్న సినిమాతో వస్తే ఆల్ ఇండియాలో 1000 కోట్లు కలెక్షన్స్ రాబట్టగల సత్తా ఆయనకు ఉంది. ఆ రేంజ్ లో ఆయన క్రేజ్ కొనసాగుతుంది. సరైన సినిమా పడితే చిరు రికార్డులు కొల్లగొడతారు అంటూ నెగిటివ్ కామెంట్స్ చేసేవారి నోళ్లు మూయించారు భరద్వాజ. ఇక ఈ సంక్రాంతికి వచ్చింది రెండు సినిమాలు కూడా మంచి హిట్ అయి రెవిన్యూ తెచ్చాయి. చిత్ర పరిశ్రమలో కొత్త ఏడాదిలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి అంటూ తమ్మారెడ్డి భరద్వాజ రిప్లై ఇచ్చారు. కాగా సంక్రాంతికి వచ్చిన ఈ రెండు సినిమాలో హిట్ అవడంతో ఇక ఫాన్స్ మధ్య కూడా ఎలాంటి గొడవలు లేకుండా పోయాయి అని చెప్పాలి.