సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఇంకా ఆయనకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు..హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస విజయాలతో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని షేక్ చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా సర్కారువారి పాట మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పక్క యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి మరోసారి రెడీ అవుతున్నారు మహేష్ , త్రివిక్రమ్. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే మొదలైంది.మహేష్ ఇంట వరుస విషాదాలు జరగడంతో ఈ సినిమా షూటింగ్ కు బిగ్ బ్రేక్ పడింది. అయితే ఈమధ్యనే మహేష్ తిరిగి షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు పాన్ ఇండియా టాప్ డైరెక్టర్ దర్శక ధీరుడు రాజమౌళితో ఓ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.


సూపర్ స్టార్ మహేష్ తో ఓ గ్లోబల్ అడ్వెంచర్ మూవీ చేయనున్నారు జక్కన్న. ఇక రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మహేష్ కథను రెడీ చేస్తున్నారు. ఆఫ్రికా అడవి నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని టాక్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. ఇండియానా జోన్స్ ఫ్రాంఛైజీ మూవీస్ జోనర్ లో మహేష్ సినిమా ఉంటుందని పక్కా క్లారిటీ ఇచ్చారు.అయితే ఈ మూవీలో మహేష్ బాబు లుక్స్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో బాగా చక్కర్లు కొడుతోంది. అయితే ఈ మూవీలో మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన వన్ నేనొక్కడినే స్టైల్ లో ఉంటుందని సమాచారం తెలుస్తోంది. రాజమౌళికి సుకుమార్ దర్శకత్వం వహించిన వన్ నేనొక్కడినే అంటే చాలా ఇష్టమని.. అందులో మహేష్ లుక్ అంటే ఇంకా ఇష్టమని.. మహేష్ అచ్చం హాలీవుడ్ హీరోలా కనిపించాడని గతంలో జరిగిన ఒక ఇంట్రవ్యూలో చెప్పుకొచ్చారు రాజమౌళి. ఇప్పుడు ఇదే స్టైల్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమాలో కనిపించనున్నాడని అందుకు రాజమౌళి సుకుమార్ హెల్ప్ తీసుకోబోతున్నాడని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: