
అంతేకాదు ఇక ఇద్దరి జోడి అటు ప్రేక్షకుల మదిలో ఎవర్ గ్రీన్ ప్రేమికులుగా స్థిరపడిపోయింది అని చెప్పాలి. అందుకే సుధీర్ రష్మీ ఒక్కచోట కనిపిస్తే చాలు పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతూ ఉంటారు. అయితే జబర్దస్త్ ద్వారా అందరికంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న సుదీర్.. చివరికి ఆ షో కి గుడ్ బై చెప్పేసాడు. అయితే ఇతగాడు మళ్ళీ షోలోకి రి ఎంట్రీ ఇస్తాడు అని ఎన్ని వార్తలు వినిపించినా... ఇప్పటివరకు అది జరగలేదు. ఇక ఇప్పుడు రష్మీ కూడా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పబోతోంది అన్నది తెలుస్తుంది.
అయితే రష్మీ సుధీర్ ఇలా విడిపోవడానికి కారణం మరో హాట్ యాంకర్ అన్నది తెలుస్తుంది. రష్మీ, సుధీర్ జోడి కి పాపులారిటీ ఎక్కువగా రావడంతో ఆ హాట్ యాంకర్ అస్సలు చూడలేక పోయిందట. ఈ క్రమంలోనే ఇక సుధీర్ ను జబర్దస్త్ నుంచి పంపించాలని ఎన్నో ప్రయత్నాలు చేసిందట. కానీ కుదరలేదు. కానీ ఎట్టకేలకు సుధీర్ బయటకు వెళ్లిపోవడంతో తెగ ఆనంద పడిపోయిందట. అంతేకాదు ఎక్కడైనా సుధీర్, రష్మీ మాట్లాడుకున్న చూసి అస్సలు ఓర్వలేదట సదరు యాంకర్. ఇక సదరు హాట్ యాంకర్ కారణంగానే రష్మీ, సుధీర్ విడిపోయారు అన్న ఒక వార్త మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.