తెలుగు ఇండస్ట్రీ లో మెగా తనయుడు ఐనా వరుణ్ తేజ్ ఇటీవల "గని" మూవీ తో మంచి హిట్ అందుకోలేకపోయినా తర్వాత వచ్చిన "ఎఫ్ 3" మూవీ తో మాత్రం మంచి హిట్ ను అందుకున్నాడు.

లేటెస్ట్ గా  వరుణ్ తేజ్ ఒక ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు తో కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. ఐతే అది 'వీటీ12' అనే వర్కింగ్ టైటిల్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ మూవీ షూటింగ్ పోయిన సంవత్సరం  అక్టోబర్లో నే మొదలైంది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ కూడా ఆసక్తిగానే ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యనే చిత్ర బృందం వరుణ్ తేజ్ బర్త్డే సందర్భంగా మూవీ టైటిల్ ను ప్రకటించింది.

ఐతే ఆ మూవీ పేరును "గాండీవధారి అర్జున" అనే ఇంటరెస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతోంది. సినిమా టైటిల్ కే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుతోంది. లేటెస్ట్ అప్డేట్  ప్రకారం ఈ మధ్యనే చిత్రం బృందం ఇంగ్లాండ్లో ఒక కీలకమైన షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసింది. ఈ షూటింగ్ షెడ్యూల్ కోసం దర్శక నిర్మాతలు కొంతమంది ఫారిన్ టెక్నీషియన్స్ ను సెలెక్ట్  చేసి వారితో కొన్ని ఇంటెన్స్ యాక్షన్స్ సీన్స్తీసినట్లు  తెలుస్తోంది. ఇంగ్లాండ్ లోని కొన్ని అద్భుతమైన లొకేషన్ లలో ఈ షూటింగ్ షెడ్యూల్ జరిగిందని విశ్వాసనియా వర్గాలనుండి అందిన సమాచారం.

ఐతే ఈ మూవీ కోసం నిర్మాతలు భారీ బడ్జెట్ ను వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ ఇంతకుముందు ఎపుడు కనిపించినటువంటి స్టైలిష్ లుక్కుతో వరుణ్ తేజ్మూవీ లో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పతాకం పై ఈ మూవీ ని నిర్మిస్తున్న బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్ ను పెడుతున్నారట. వరుణ్ తేజ్ తన కెరియర్ లోనే ఇది చాలా భారీ బడ్జెట్ అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఐతే దీనికి మిక్కీ జే మేయర్మ్యూజిక్ ని అందిస్తున్నారట.

మూవీ వరున్ తేజ్ కి భారీ విజయాన్ని చేకూర్చాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: