
ఈ క్రమంలోనే నయనతార షారుక్ జవాన్ సినిమాకు గుడ్ బాయ్ చెప్పబోతోంది అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. కానీ ఈ వార్తల పై స్పందించిన నయనతార తాను ఇప్పటికీ షారుక్ జవాన్ సినిమాలో భాగం కానున్నాను అని స్పష్టం చేసింది . అంతేకాదు త్వరలోనే కొత్త షెడ్యూల్ మొదలు కాబోతోందని షెడ్యూల్లో కూడా తాను నటించబోతున్నట్లు తెలిపింది నయనతార.. ఇకపోతే అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న పాన్ ఇండియా చిత్రం చివరి షెడ్యూల్లో నయనతార పాల్గొనబోతున్నట్లు సమాచారం. పఠాన్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత షారుక్ ఖాన్ మళ్లీ షూటింగ్లో బిజీ అయిపోయారు అని చెప్పడంలో సందేహం లేదు..
జవాన్ సినిమాలో సన్యా మల్హోత్రా, ప్రియమణి, విజయసేతుపతి , సునీల్ గ్రోవర్, యోగి బాబు తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ జవాన్ చిత్రం 2023 జూన్లో థియేటర్లలో విడుదల కానుంది అని సమాచారం. ఇకపోతే మరొకవైపు నయనతార టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలకే కాదు బాలీవుడ్ చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ లేడీ సూపర్ స్టార్ కాస్త మరింత క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది అని చెప్పవచ్చు. మరి జవాన్ సినిమాతో ఈ జంట ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.