సాధారణంగా సినీ ఇండస్ట్రీకి రావడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఇక అలా కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ లాగా తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం ఎంత కష్టపడినప్పటికీ వారికి సరైన గుర్తింపు రాదు. ఇక అలా చాలా తక్కువ సమయంలోనే హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కన్నడ బ్యూటీ శ్రీ లీల. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మొదటి సినిమా పెద్దగా హిట్ కాకపోయినప్పటికీ హీరోయిన్గా మాత్రం ఈమెకి మంచి గుర్తింపు లభించింది.

పెళ్లి సందడి సినిమాతో శ్రీకాంత్ కొడుకు రోషన్ సరసన హీరోయిన్గా నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది శ్రీ లీల. ఈ సినిమా పెద్దగా హిట్ కానప్పటికీ హీరోయిన్గా మాత్రం ఈమెకి వర్ష సినిమాలలో అవకాశాలు వచ్చాయి. ఇటీవల రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో రవితేజ సరసన హీరోయిన్గా నటించింది ఈమె ఇక ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో ఈమె రేంజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం శ్రీ లీలా చేతిలో ఐదు నుండి ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక ఈ విషయంలో సీనియర్ హీరోయిన్ల కంటే శ్రీ లీల బెస్ట్ అని అంటున్నారు చాలామంది. ఎందుకు అంటే ఏమి కంటే ముందు వచ్చిన చాలామంది హీరోయిన్ల

 చేతిలో ఇప్పుడు ఇన్ని ప్రాజెక్టులు లేవు. దీంతో శ్రీలను పొగడ్తలతో ముంచేస్తున్నారు. ప్రస్తుత మహేష్ బాబు నటిస్తున్న ssmb 28 సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోందని తెలుస్తోంది. దాంతోపాటు నితిన్, శర్వానంద్ ఇలా సినిమాలలో కూడా నటిస్తోంది శ్రీ లీల. అంతే కాదు బాలకృష్ణ మరియు కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమాల్లో కూడా బాలయ్యకు కూతురుగా నటిస్తోంది ఈమె. ఇదిలా ఉంటే ఇక శ్రీల ఇండస్ట్రీలో వచ్చిన తక్కువ సమయంలోనే ఇలా అవకాశాలను దక్కించుకోవడానికి ఒక వ్యక్తి ప్రధాన కారణం అంటూ తెలుస్తోంది. ఇక ఆ వ్యక్తి వల్లే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఈమెకి ఇండియా అవకాశాలు వస్తున్నాయని కూడా అంటున్నారు. అంతేకాదు ఆ వ్యక్తి పేరు కూడా త్వరలోనే బయటకు రానుందని  తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసిన చాలా మంది ఈమెకి ఇన్ని అవకాశాలు రావడానికి ఆ వ్యక్తి కారణమా ఎవరైనా అంటూ ఆ వ్యక్తి గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు.దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: