మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ రెండవ భర్త కళ్యాణ్ దేవ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన చేసే సినిమాలు కన్నా తన పర్సనల్ విషయాల గురించి ఎప్పుడూ వార్తలో నిలుస్తూ ఉంటారు వీరు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఆయన వినాలని విడాకులకు సంబంధించిన వార్తలు ఎంతలా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత కొంతకాలంగా వీళ్ళు కలిసి ఉండడం లేదు అని తెలుస్తోంది .ఇక అలా అందరూ భావించడానికి వీరు తమ తమ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులే కారణం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు కళ్యాణ్ దేవ్ కి శ్రీజ విడాకులు ఇస్తుంది అంటూ ఎప్పటి నుండో సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి .ఇన్ని రకాల వాహస్తులు వస్తున్నప్పటికీ మెగా ఫ్యామిలీ మాత్రం ఇంతవరకు ఆ విషయాలపై క్లారిటీ ఇవ్వలేదు. 

దీంతో నిజంగానే శ్రీజ తన రెండవ భర్తకి కూడా విడాకులు వేస్తుందని అందరూ నమ్ముతున్నారు. అయితే మొదట శ్రీజాతన సోషల్ మీడియా ఖాతాలో నుండి తన భర్త కళ్యాణ్ పేరును తొలగించింది. అప్పటినుండి వీరిద్దరికీ సంబంధించిన విడాకుల వార్తలు రావడం మొదలయ్యాయి. దీంతోపాటు గత కొన్నాళ్లుగా కళ్యాణ్ దేవ్ మెగా కుటుంబంలో ఎక్కడ కూడా కనిపించడం లేదు. దీంతో నిజంగానే వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు అని అందరూ ఫిక్స్ అయ్యారు. తాజాగా ఉన్న కళ్యాణ్ దేవి పుట్టినరోజు వేడుకకు గాను తన కూతురు ఆవిష్క వచ్చింది. ఈ నేపథ్యంలోనే తన పుట్టినరోజు తోపాటు తన కూతురి నాలుగవ పుట్టినరోజు వేడుకలను కూడా చాలా గ్రాండ్ గా చేశాడు కళ్యాణ్ దేవ్. అంతే కాదు ఇందులో భాగంగానే ఇంతకంటే గొప్ప బహుమతి నాకు దొరకదు అంటూ తన బర్త్డేని తన కూతురితో సెలబ్రేట్ చేసుకున్నాడు కళ్యాణ్.

ఇంతకాలంగా వారిద్దరి విడాకులకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ ఇప్పటిదాకా ఆ వార్తలు పై క్లారిటీ అయితే లేదు. ఏ విషయంలో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయో ఇంతవరకు ఎవరికీ తెలియదు. విడాకులు తీసుకునేంతలా వీరిద్దరి మధ్య ఏం జరిగి ఉంటుంది అంటూ అందరూ ఆరా తీస్తున్నారు. అయితే తాజాగా కళ్యాణ్ దేవ్ పరోక్షంగా తాను శ్రీజ తో ఎందుకు దూరంగా ఉన్నాడో చెప్పుకొచ్చాడు. తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ని షేర్ చేశాడు కళ్యాణ్. ఇందులో భాగంగానే ఆయన. ఎదుటివాళ్ళు మనల్ని ఎంతగా లైక్ చేస్తున్నారనేది ముఖ్యం కాదు వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అన్నదే ముఖ్యం అంటూ ఒక ఎమోషనల్ కొటేషన్ను షేర్ చేశాడు కళ్యాణ్. దీంతో కళ్యాణ్ చేసిన పోస్ట్ కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ పోస్ట్ ని చూసిన చాలా మంది కళ్యాణ్ కు మెగా ఇంట్లో ఏదైనా అవమానం జరిగి ఉంటుందా అందుకే వీరిద్దరూ విడిపోయారా అంటూ ఆరా తీస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: