వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ధనుష్ హీరో గా వచ్చిన సినిమా సార్ ఈ సినిమా రీసెంట్ గా విడుదల అయి మంచి సక్సెస్ సాధించింది.ఈ సినిమా లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా అయితే నటించింది.
సముద్ర ఖని ఒక ముఖ్య పాత్రలో అయితే నటించాడు. ఇక ఇది ఇలా ఉంటె వెంకీ అట్లూరి తీసిన మొదటి సినిమా వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ సినిమా...ఈ సినిమా మంచి విజయం అయితే అందుకుంది.ఇది లవ్ స్టోరీ కావడం వల్ల ఆ లవ్ లో ఉండే చిన్నపాటి గొడవలని చాలా బాగా తాను చూపించాడు కానీ తన సెకండ్ ఫిల్మ్ అయిన మిస్టర్ మజ్ను సినిమా లో క్లారిటీ అనేదే లేకుండా పోయింది స్క్రీన్ ప్లే అయితే చాలా బోరింగ్ గా రాశారు సీన్స్ మన ఒపికకి పరీక్ష పెడతాయి.అలాగే వెంకీ అట్లూరి ఫస్ట్ హాఫ్ అంతా ఇండియా లో పెట్టీ సెకండ్ హాఫ్ వేరే కంట్రీ లో పెడతాడు అని అతని మీద చాలా మీమ్స్ కూడా బాగా వచ్చాయి…

తన మీద చాలా మీమ్స్ వస్తున్నాయి తనే స్వయంగా నే ఒప్పుకున్నాడు... ఇక ఆయన చేసిన రంగ్ దే సినిమా స్టోరీ కూడా రొటీన్ గా ఉంటుంది.అలాగే సినిమా చూస్తున్నంత సేపు ఏవో కొన్ని సీన్లు బాగుంటాయి కానీ మిగితావన్ని మనకు మాత్రం కనెక్ట్ అవ్వవు. స్టోరీ అలా నడిపించాలి కాబట్టి నడిపించినట్టు గా ఉంటుంది తప్ప ఒక్క చోట కూడా అస్సలు ఫీల్ ఉండదు...ఇక సార్ సినిమా విషయానికి వస్తే ఇది ఒక మంచి స్టోరీ దాన్ని చాలా బాగా చెప్పవచ్చు కానీ వెంకీ ఆ సినిమాని డీల్ చేసే విషయం లో కొన్ని చోట్ల తడబడ్డాడు అనే చెప్పవచ్చు ...ఈ సినిమా కరెక్ట్ గా కనక తీసి ఉంటే ఇటు వెంకీ కెరియర్ లో అలాగే అటు ధనుష్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా అయితే నిలిచేది...ఇప్పుడు సార్ సినిమా అబౌవ్ యావరేజ్ అయిందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: