పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే సుకుమార్సినిమా స్క్రిప్ట్ ని పక్కాగా ప్లాన్ చేశాడు. అయితే పుష్ప 2 తర్వాత బన్నీ లైనప్ రాబోయే రోజుల్లో ఆయన క్రేజ్ ని మరింత పెంచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఏ ఏ డైరెక్టర్స్ తో పనిచేస్తున్నాడనే వివరాల్లోకి వెళితే.. తాజా సమాచారం ప్రకారం పుష్ప2 రిలీజ్ లోపే మరో ఇద్దరు డైరెక్టర్స్ ని బన్నీ లైన్ లో పెట్టాడట. అందులో ఒకరు సురేందర్ రెడ్డి. బన్నీకి రేసుగుర్రం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డి ప్రస్తుతం అఖిల్తో ఏజెంట్ అనే మూవీ చేస్తున్నాడు. 

మూవీ కంప్లీట్ అయిన తర్వాత బన్నీ ప్రాజెక్టుపై ఫోకస్ పెడతారట. అసలైతే సురేందర్ రెడ్డి ముందు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలి. కానీ ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. అయితే ఇప్పుడు బన్నీ కోసం సురేందర్ రెడ్డి ఇంకా పూర్తిస్థాయిలో కథను ఫైనల్ చేయలేదు. ఏజెంట్ హిట్ అయిన తర్వాత బన్నీకి నచ్చే విధంగా సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ రెడీ చేస్తే ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ ఇది కనుక సెట్ అవ్వకుంటే వెంటనే త్రివిక్రమ్ తో సినిమాని పట్టా లెక్కించబోతున్నాడట బన్నీ. ఇక ఈ డైరెక్టర్స్ లో ఒకరితో మూవీ కంప్లీట్ చేసిన వెంటనే తన 23వ సినిమాని అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ప్లాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. లేకుంటే 2025 ఆరంభంలో సెట్స్ పైకి వెళ్తుంది. ఈ మూవీ తర్వాత తన 24వ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై చేయడానికి బన్నీ ఇప్పటికే ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఈ కాంబినేషన్ ఎప్పుడో సెట్ అయింది. గతంలో గీత ఆర్ట్స్ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. అయితే ప్రస్తుతం మురగదాస్ తమిళంలో శివ కార్తికేయన్తో భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద రాబోయే రోజుల్లో బన్నీ లైనర్ చూస్తుంటే కచ్చితంగా పుష్ప రాజ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం ఖాయమని చెప్పొచ్చు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: