యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొంత కాలం క్రితమే ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ లో హీరో గా నటించి అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్న ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనుండగా ... రత్నవేలు సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు.

మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ఈ నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని పాన్ ఇండియా స్థాయి కి మించి 9 భాషలలో విడుదల చేయడానికి ఈ చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ మూవీ ని దర్శకుడు కొరటాల శివ మెడికల్ మాఫియా నేపథ్యంలో రూపొందించ బోతున్నట్లు ఒక వార్త కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరు అనేదాన్ని మాత్రం ఈ మూవీ యూనిట్ ప్రకటించ లేదు.

మూవీ లో ఎన్టీఆర్ సరసన  జహ్నవి కపూర్ హీరోయిన్ గ నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందుకు సంబంధించిన ప్రకటన ను కూడా ఈ మూవీ యూనిట్ మార్చి 6 వ తేదీన ఒక వీడియో ద్వారా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ "కే జి ఎఫ్" మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: