ఇటీవల కాలంలో టాలీవుడ్ లో బాలీవుడ్ భామలదే  ఎక్కువగా హవా నడుస్తుంది. టాలీవుడ్ లో ఎవరు హీరోయిన్లు లేరు అన్నట్లు స్టార్ హీరోల సినిమాల్లో ఇక బాలీవుడ్ భామలను ఎంపిక చేస్తూ ఉన్నారు డైరెక్టర్లు. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రభాస్ సినిమాలో దీపికా పదుకొనే నటిస్తోంది. ఇక ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్  నటిస్తుంది. ఇక ఎన్టీఆర్ 30 సినిమాలో జాన్వి కపూర్ ఫిక్స్ అయిపోయింది అన్న విషయం తెలిసిందే. మరోవైపు రామ్ చరణ్ సినిమాలో కియారా అద్వానీ నటిస్తోంది. ఇక వరుణ్ తేజ్ సినిమాలోను బాలీవుడ్ భామే సందడి చేయబోతుంది.



 అయితే ఇక ఇలా టాలీవుడ్ లో హవ నడిపించేందుకు సిద్ధమవుతున్న బాలీవుడ్ హీరోయిన్లు ఇక రెమ్యూనరేషన్ విషయంలో కూడా తగ్గేదేలే అంటున్నారు అన్నది మాత్రం అర్థం అవుతుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్టుకే సినిమాలో ప్రభాస్ సరసన రొమాన్స్ కు సిద్ధమైన దీపిక పదుకొనే రెమ్యూనరేషన్ మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా ప్రభాస్ సినిమా కోసం 10 కోట్ల రూపాయల పారితోషకం అందుకుంటుందట దీపికా పదుకొనే. అయితే ఇప్పటివరకు దేశంలో ఏ టాప్ హీరోయిన్ కూడా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోలేదు అని చెప్పాలి.



 పూజా హెగ్డే, రష్మిక మందన్న లాంటి హీరోయిన్లు ఇప్పటివరకు నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇప్పటివరకు ఇదే టాప్ లో ఉండేది. కానీ అలాంటిది దీపికా పదుకొనే ఇప్పుడు 10 కోట్లు డిమాండ్ చేయడం మాత్రం అందరిని ఆశ్చర్యపరిస్తుంది. ఇక ఆమె క్రేజ్ కూడా అదే రేంజ్ లో ఉంది అని చెప్పాలి. ఇక ఇటీవలే దీపిక పదుకొనే షారుక్ ఖాన్ తో పఠాన్ మూవీలో నటించి భారీ హిట్టు కొట్టింది. ఏది ఏమైనా టాలీవుడ్ హీరోయిన్లను వదిలేసి బాలీవుడ్ భామల వెంట పడుతున్న దర్శకులు ఇక వారికి భారీ రెమ్యూనరేషన్ ముట్ట చెప్పేందుకు కూడా వెనకడుగు వేయడం లేదు అన్నది అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: