సినీ ఇండస్ట్రీలో సాధారణంగా ఒక్కో సమయంలో ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ప్రస్తుతం అలా వెండి తెరపై ట్రెండ్ అవుతున్న సెంటిమెంట్ సిస్టర్ .సీనియర్ స్టార్స్ అంతా ప్రస్తుతం ఈ జానర్ మీద కాన్సెంట్రేట్ చేస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగుతోపాటు తమిళ భాషల్లో కూడా ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న భూల శంకర్ సినిమాలో కూడా ఇది సెంటిమెంట్ ఉంటుంది అని తెలుస్తుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. 

ఇక ఈ సినిమా కూడా సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలోనే రావడంతో అందరూ ఈ సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .ఇక తమిళ సూపర్ హిట్ వేదలను సినిమాకు రీమేక్ గా రానున్న ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ కనిపించనుంది. అంతేకాదు ఇటీవల నందమూరి బాలకృష్ణ కూడా సిస్టర్ సెంటిమెంట్ తోనే మరొక బ్లాక్ బస్టర్ విజయాన్ని తన కథలు వేసుకున్నాడు.మాస్ ఎంటర్టైర్యంగా విడుదలైన వీర సింహారెడ్డి సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ కు ఎంతటి గుర్తింపు లభించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఇప్పుడు మరోసారి పెద్దన్నగా మారెందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది.

కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో వస్తున్న లాల్ సలాం సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు రజనీకాంత్మ్ ఇక ఈ సినిమాలో సీనియర్ నటి జీవిత సూపర్ స్టార్ కు చెల్లెలుగా నటిస్తోందని తెలుస్తోంది. ఆ మధ్యకాలంలో పెద్దన్నగా అన్న సెంటిమెంట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు రజినీకాంత్ .ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. దీంతో మరోసారి అదే తరహాలో అలాంటి పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రజనీకాంత్. ఇక ఈ సినిమా అయినా సక్సెస్ అవుతుందా లేదా అన్నది చూడాలి మరి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: