మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోయిన సంవత్సరం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అత్యద్భుతమైన ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు కూడా లభించాయి. ఇప్పటికే ఈ మూవీ లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు కూడా నామినేట్ అయ్యింది.

మూవీ తో అదిరిపోయే రేంజ్ గుర్తింపును సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. కియార అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతుంది.

మూవీ యొక్క టైటిల్ ను రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో ఈ చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం "సీ ఈ వో" అనే టైటిల్ ను ఈ మూవీ యూనిట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ చరణ్ ట్విట్టర్ లో ఒక అదిరిపోయే రేర్ మార్క్ ఫాలోవర్స్ ను సాధించాడు. ట్విట్టర్ ద్వారా ఎక్కువగా అభిమానులతో టచ్ లో ఉండే రామ్ చరణ్ తాజాగా ట్విట్టర్ లో 3 మినయన్ ఫాలోవర్స్ ను సాధించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: