టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ కి ఇళయ రాజా , యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తూ ఉండగా ... ఈ మూవీ లో కృతి శెట్టి ... నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించింది. ఇది వరకే వీరిద్దరూ కలిసి బంగార్రాజు మూవీ లో నటించారు.

మూవీ మంచి విజయం సాధించింది. అలాగే ఈ జంటకు కూడా మంచి గుర్తింపు లభించింది. నాగ చైతన్య ... కృతి శెట్టి రెండవ సారి నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై నాగ చైతన్య అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ లో నాగ చైతన్య పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. అరవింద్ స్వామి ... ప్రియమణిమూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అయింది. ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

అలాగే ఈ మూవీ కి సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వేదవంతంగా జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మూవీ కి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటల 49 నిమిషాలకు విడుదల చేయనునట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సినిమా బృందం ఈ మూవీ కి సంబంధించిన ఏలాంటి అప్డేట్ ను విడుదల చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: