విక్టరీ వెంకటేష్ మరియు దగ్గుపాటి రానా కలిసి తాజాగా రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించిన విషయం మన అందరికీ తెలిసింది.  కెరియర్ లో మొట్ట మొదటి సారి వెంకటేష్  ... రాణా కలిసిన వెబ్ సిరీస్ కావడం ... అలాగే వీరిద్దరూ ఈ వెబ్ సిరీస్ తో వీరిద్దరు కూడా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ వెబ్ సిరీస్ పై దగ్గుపాటి అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాల నడుమ ఈ వెబ్ సిరీస్ కొన్ని రోజుల క్రితమే ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటు వంటి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అందుబాటు లోకి వచ్చింది. చాలా కాలంగా ఎంతో మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్న వెబ్ సిరీస్ కావడంతో ఈ వెబ్ సిరీస్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి అందుబాటు లోకి రావడం తోనే ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది.

లా ప్రేక్షకుల నుండి ఈ వెబ్ సిరీస్ కు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తూ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్  "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో టాప్ 10 వెబ్ సిరీస్ ల లిస్ట్ లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించిన దగ్గుపాటి రానా తను సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మరి ఈ రెస్పాన్స్ ఇచ్చినందుకు థాంక్స్ చెప్తూ ఎవరికైతే నచ్చలేదో వారికి తన క్షమాపణలు కూడా రానా తెలిపాడు. తాజాగా రానా ఈ వెబ్ సిరీస్ గురించి చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: