యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పోయిన సంవత్సరం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం అలాగే ఈ మూవీ లో ఎన్టీఆర్ నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించడంతో ఈ మూవీ ద్వారా ఎన్టీఆర్ కు గ్లోబల్ గా క్రేజ్ లభించింది. ఇలా ఆర్ ఆర్ ఆర్ సినిమాతో అదిరిపోయే రేంజ్ గుర్తింపును సంపాదించుకున్న ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీ ని కొరటాల శివ తో చేయబోతున్నాడు.

మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. అలాగే ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నట్లు , రత్నవేలు సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నట్లు , జాహ్నవి కపూర్ కపూర్ ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ మొదటి వారం నుండి ప్రారంభం కాబోతున్నట్లు ... ఇందు కోసం ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఒక భారీ సెట్ ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను యాక్షన్ ఎపిసోడ్ తో మొదలు పెట్టడానికి చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తున్నట్లు ... ఈ మొదటి యాక్షన్ ఎపిసోడ్ ను రామ్ లక్ష్మణ్ మాస్టర్ లు కొరియో గ్రఫీ చేయనున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని కొరటాల శివ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందించ బోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: