సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో పూజ హెగ్డే ... శ్రీ లీల ... మహేష్ సరసన హీరోయిన్ లుగా కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ కి పీఎస్ వినోద్ ఫోటోగ్రఫి అందిస్తుండగా ... హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్య దేవర రాధా కృష్ణ దీనిని భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

కొన్ని రోజుల క్రితమే షూటింగ్ ప్రారంభం అయిన ఈ మూవీ యొక్క చిత్రీకరణ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు మూవీ యూనిట్ టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా మహేష్ కెరియర్ లో 28 వ సినిమాగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా షూటింగ్ ను ఎస్ఎస్ఎంబి 28 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుగుతుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కోసం చిత్ర బృందం అర్జునుడు ... అతడే పార్ధు అనే టైటిల్ లను పరిశీలిస్తున్నట్లు ... ఈ రెండు టైటిల్ లలో ఏదో ఒక దానిని ఈ సినిమాకు పెట్టే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు ఒక వార్త కొన్ని రోజులు వైరల్ అయింది. కాకపోతే ఇప్పటి వరకు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కోసం ఈ చిత్ర బృందం మరో పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ కి అమ్మ కథ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: