సాయి పల్లవి గురించి ఎక్కడ చూసినా ఒక వార్త బాగా వైరల్ గా మారింది. ఆమె కమర్షియల్ గా విజయం సాధించిన వారసుడు మరియు తెగింపు సినిమాలను వద్దని రిజెక్ట్ చేసిందని సమాచారం.

సాయి పల్లవి తన సినిమాల విషయంలో ఎంతో ఆచితూచి అడుగులు వేస్తుందనే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆమె కమర్షియల్ సినిమాలు ఇప్పటివరకు చేయలేదని కొన్ని గాసిప్స్ వస్తున్నాయి. కానీ 

గతంలో ధనుష్ తో మారి 2 అంటూ పక్కా కమర్షియల్ సినిమా సాయి పల్లవి చేసిన సంగతి కూడా అందరూ గుర్తుంచుకోవాలి. ఈ సినిమాలో రౌడీ బేబీ పాట రికార్డులకు ఎక్కిన సంగతి కూడా తెలిసింది.మరి వారసుడు, తెగింపు సినిమాలను సాయి పల్లవి రిజెక్ట్ చేసి అవకాశం అస్సలు లేనేలేదని తెలుస్తుంది.ఆమె గత సినిమాలు కొన్ని పరాజయం పాలు అవ్వడంతో సైలెంట్ అయిపోయింది.కాబట్టి అన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తుందని దాని అర్థం కాదు. ఆచితూచి అడుగులు వేయడంలో సాయి పల్లవి తరువాతే ఎవరైనా అని చెప్పొచ్చు.. ఆమెతో సినిమా చేయాలంటే ఆమె కండిషన్స్ కి సినిమా యూనిట్ కచ్చితంగా ఒప్పుకొని  తీరాలి.

అయితే వారసుడు, తెగింపు సినిమాల విషయంలో మాత్రం అలా జరగలేదటా.ఇది పూర్తిగా ఒక గాసిప్ మాత్రమే అని విజయ్ లాంటి ఒక స్టార్ హీరో సినిమాలో నటించమంటే సాయి పల్లవి నో అనే ఛాన్స్ అయితే లేదు అలా అని ఆ సినిమాలో తన హద్దులు కూడా ముందుగానే చెబుతుంది. తన హద్దుల ప్రకారమే విజయ్ నటించే అవకాశాలు కూడా ఉన్నాయి. అజిత్ విషయంలో కూడా ఇదే జరిగే అవకాశం అయితే ఉంది. ఇక ప్రస్తుతం ఆమె ఏ సినిమా నటిస్తున్న సంగతి బయటకు తెలియడం లేదు సినిమాలు చేస్తుందా ఆపేస్తుందా అన్న క్లారిటీ కూడా లేదు. సినిమాల కోసం చదువును పక్కకు పెట్టిన సాయి పల్లవి ఇప్పుడు సినిమాలను కూడా పక్కన పెట్టడం కూడా పెద్ద విషయం కాదు.. అందుకే సాయి పల్లవి వంటి హీరోయిన్స్ విషయంలో గాసిప్స్ క్రియేట్ చేసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఒకటికి పది సార్లు అయితే ఆలోచించుకోవాలి. తనకు సినిమాల్లో అవకాశం లేకపోతే ఒక క్లినిక్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తాను అని గతంలో సాయి పల్లవి చెప్పిన చేసిన సంగతి కూడా తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: