యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొంత కాలం క్రితమే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆది పురుష్ మూవీ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్న విషయం మన అందరికీ తెలిసింది. ప్రభాస్ తో పాటు ఈ మూవీ లో ఇతర నటీనటులకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కూడా ఇప్పటికే పూర్తి అయ్యే చాలా కాలం అవుతుంది. ఈ మూవీ లో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రభాస్ ఈ సినిమాలో రాముడి పాత్రలో కనిపించనుండగా ... కృతి సనన్ ఈ సినిమాలో సీత పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నాడు. సైఫ్ అలీ ఖాన్మూవీ లో రావణాసురుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం టీజర్ ను విడుదల చేయగా ... ఆ టీజర్ కు ప్రేక్షకుల నుండి కాస్త నెగటివ్ టాక్ లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఈ మూవీ యూనిట్ పూర్తి చేస్తుంది.

మూవీ ని జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ ట్రైలర్ కు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీ విడుదలకు చాలా రోజుల ముందే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ యొక్క ట్రైలర్ ను మే నెలలోనే విడుదల చేయడానికి ఈ చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ ట్రైలర్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: